Breaking News

ఆన్‌లైన్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి

కామారెడ్డి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్టిఓ ఆఫీస్‌ సమీపంలో తెలంగాణ స్టేట్‌ మినరల్‌ డెవల‌ప్మెంట్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన
ఇసుక డిపోను జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ. శరత్‌ పరిశీలించారు. ఇసుక అవసరమున్న జిల్లా ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాల‌ని కోరారు.

మీ సేవ కేంద్రాల‌, ఆన్‌లైన్‌ ద్వారా ట్రాక్టర్‌ నెంబర్‌ రిజిస్ట్రేషన్‌ చేసుకుని అనంతరం ట్రాక్టర్‌ ఇసుక కోసం 4 వేల‌ 400 రూపాయలు చెల్లించాల‌ని సూచించారు. పూర్తి వివరాల‌కు సెల్‌ నెంబర్లు 9491478962, 8106678940 ను సంప్రదించాల‌ని సూచించారు. దళారుల‌ను ఆశ్రయించవద్దని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్‌డిఓ నరేందర్‌, మైన్స్‌ ఏడి రాంబాబు, టీఎస్‌ ఎండిఎల్‌ ప్రాజెక్ట్‌ అధికారి రామకృష్ణ పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా ...

Comment on the article