Breaking News

మొక్కల‌ సంరక్షణ బాధ్యత గ్రామ పంచాయతీల‌దే

కామారెడ్డి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ రహదారిపై కిలోమీటర్‌కు 1 వేయి 266 మొక్కలు ఉండే విధంగా సర్పంచులు, కార్యదర్శులు పరిశీల‌న చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కలెక్టర్‌ కార్యాల‌యంలోని జనహిత హాలులో హరితహారం కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.

అటవీ శాఖ ఆధ్వర్యంలో నాటిన మొక్కల‌ సంరక్షణ బాధ్యతను గ్రామ పంచాయతీల‌కు అప్పగించనున్నట్లు చెప్పారు. హైవే అధికారులు నాటిన మొక్కల‌ సంరక్షణను గ్రామ పంచాయతీల‌కు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిఎఫ్‌ఓ వసంత, సర్పంచులు, కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా ...

Comment on the article