Breaking News

నివేదికలు నిర్ణీత సమయంలోగా పంపాలి

కామారెడ్డి, జూలై 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పల్లె ప్రగతి, జాతీయ ఉపాధి హామీ పనులు, రైతు వేదికల‌ నిర్మాణం, రైతు కల్లాల‌ నిర్మాణం, హరితహారం తదితర కార్యక్రమాల‌ను జిల్లాలో వేగవంతం చేయడానికి జిల్లా లోని 22 మండలాల‌కు జిల్లా అధికారుల‌ను స్పెషల్‌ ఆఫీసర్స్‌గా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశాలు జారీ చేశారు.

పల్లె ప్రగతి కార్యక్రమాల‌కు సంబంధించి రోడ్లకు ఇరువైపులా ఎవెన్యూ ప్లాంటేషన్‌, ప్రతి రోజూ పారిశుద్ధ్యం, డంపింగ్‌ యార్డ్‌, వైకుంఠధామాలు, మంకీ ఫుడ్‌ కోర్టు చుట్టూ హరితకంచె ఏర్పాట్లు, కమ్యూనిటీ టాయిలెట్‌ నిర్మాణం, గ్రామ పంచాయతీ బిల్లుల‌ చెల్లింపు, ఓహెచ్‌ఆర్‌ ట్యాంకు పరిశుభ్రత, ట్యాంక్‌ చుట్టూ మొక్కల‌ పెంపకం, ఉపాధి హామీ పనుల్లో కూలీల‌ నమోదు, రోడ్లకు ఇరువైపుల‌ ముళ్ళపొదల తొల‌గింపు , మొక్కల‌ సంరక్షణ, రికార్డు నిర్వహణ, ఇంకుడు గుంతలు, అటవీ నవీకరణ పనులు, హరితహారం సంబంధించి మొక్కలు నాటే ల‌క్ష్యాన్ని సాధించడం, మొక్కల‌కు నీరు పోయడం, 85 శాతం మొక్కల‌ సంరక్షణ సంబంధించి జిల్లాలోని మండలాల‌ స్పెషల్‌ ఆఫీసర్ల నియామకం చేపట్టినట్టు ఉత్తర్వులో పేర్కొన్నారు.

కామారెడ్డి, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ, బికనూర్‌ మండలాల‌కు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, లింగంపల్లి, ఎల్లారెడ్డి, నాగి రెడ్డి పేట, నిజాంసాగర్‌ మండలాల‌కు ఏపిడి సాయన్న, రాజంపేట, తాడువాయి మండలాల‌కు జిల్లా పంచాయతీ అధికారి నరేష్‌, బీర్కూర్‌, నస్రుల్లాబాద్‌, గాంధారి మండలాల‌కు ఏపిడి శ్రీకాంత్‌, జుక్కల్‌, బాన్సువాడ, బిచ్కుంద మద్నూర్‌ మండలాల‌కు జిల్లా పరిషత్‌ సీఈఓ చందర్‌ నాయక్‌, పిట్లం, పెద్ద కొడప్‌గల్‌ మండలాల‌కు జిల్లా గిరిజన సంక్షేమ అధికారి అంబాజీ, సదాశివనగర్‌ మండలానికి జిల్లా ఉపాధి క‌ల్ప‌న అధికారి షబానా, రామారెడ్డి మండలానికి జిల్లా ఆడిట్‌ అధికారి విజయల‌క్ష్మి నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

స్పెషల్‌ ఆఫీసర్లు మండల‌ సమావేశాల‌లో పనుల‌ ప్రగతిని సమీక్షించాల‌ని, పనుల‌ తనిఖీలు చేపట్టాల‌ని, పనుల‌ పురోగతిపై సంబంధించిన నివేదికల‌ను నిర్ణీత సమయంలోగా పంపాల‌ని, రైతు వేదికల‌ నిర్మాణంలో సమన్వయ కర్తలుగా వ్యవహరించి పనులు వేగవంతం చేయడంలో కృషి చేయాల‌ని పేర్కొన్నారు. ప్రతి బుధవారం స్పెషల్‌ ఆఫీసర్‌తో, ప్రతి శనివారం మండల‌ స్థాయి అధికారుల‌తో, ప్రతి 15 రోజుల‌కు ఒకసారి గ్రామస్థాయి అధికారుల‌తో పనుల‌ పురోగతిపై సమీక్షించడం జరుగుతుందని తెలిపారు.

Check Also

వేదిక నిర్మాణాలు పూర్తిచేయాలి

కామారెడ్డి, జూలై 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనుల‌ను త్వరితగతిన పూర్తిచేయాల‌ని ...

Comment on the article