Breaking News

చెట్ల పెంపకమే పరిష్కారం

నిజామాబాద్‌, జూలై 3

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఐటిఐ కాలేజ్‌ గ్రౌండ్‌లో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డితో కలిసి నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ మొక్కలు నాటి నీరుపోశారు. నగరంలో హరితహారం కార్యక్రమం శరవేగంగా కొనసాగుతుందని తెలియజేస్తూ ప్రభుత్వం నిర్దేశించిన సుమారు 15 ల‌క్షల మొక్కల‌ పెంపునకు ప్రజలు కూడా సహకరించాలన్నారు.

నిజామాబాద్‌ నగరాన్ని హరిత వనంగా మార్చటానికి కృషి చేయాల‌ని పిలుపునిచ్చారు. మారుతున్న కాలంతో పాటు వాతావరణంలో అనేక మార్పుల వల‌న ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయని ప్రకృతి వైపరీత్యాల‌కు చెట్ల పెంపకం ఒక్కటే పరిష్కారమని మేయర్‌ తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత తెలంగాణకు ప్రతి ఒక్కరు కృషి చేసి హరితహారంలో భాగస్వాములు కావాల‌ని ప్రజల‌ను కోరారు.

కార్యక్రమంలో పాల్గొన్న ఐటిఐ కాలేజ్‌ ఉద్యోగుల‌ను, సిబ్బందిని ప్రశంసించారు. స్థానిక గ్రౌండ్‌కు వాకింగ్‌ వచ్చే వారు కూడా చెట్ల సంరక్షణకు పాటుపడాల‌ని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ బి. యస్‌.ల‌త, మున్సిపల్‌ కమిషనర్‌ జితేష్‌. వి. పాటిల్‌, మున్సిపల్‌ ఇంజినీర్‌ ఆనంద్‌ సాగర్‌, డి.ఇఇ ముస్తాక్‌ అహ్మద్‌, రషీద్‌, ఏ.ఇ. ఇనాయత్‌ కరీం, ఐటిఐ కాలేజ్‌ ప్రిన్సిపల్‌ కోటిరెడ్డి, కాలేజ్‌ ఉద్యోగులు, సిబ్బంది, మరియు మున్సిపల్‌ ఇంచార్జ్‌ సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ శ్రీకాంత్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

అవసరమైన మెటీరియల్‌ అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల‌ నిర్మాణం పై సంబంధిత అధికారుల‌తో జిల్లా ...

Comment on the article