Breaking News

వృద్ధునికి రక్తదానం

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మాక్లూర్‌కు చెందిన గంగిపోగు సుబ్బయ్య 57 సంవత్సరాల‌ వయసు కలిగిన వృద్ధుడికి రక్తహీనతతో ప్రాణాపాయ స్థితిలో శ్రీ విష్ణు వైద్యశాల‌ నిజామాబాద్‌లో ఉండగా వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహాన్ని గురించి తెలుసుకొని సంప్రదించారు.

నిజామాబాద్‌ కేంద్రంలో ఏబి పాజిటివ్‌ రక్తం ల‌భ్యం కాకపోవడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించడంతో ఆరేపల్లి గ్రామానికి చెందిన కెఆర్‌వి నరసింహము మరియు శ్రీనివాస్‌ సహకారంతో రెండు యూనిట్ల ఏబి పాజిటివ్‌ రక్తాన్ని అందజేసినట్లు నిర్వాహకుడు బాలు తెలిపారు.

కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ద్వారా రాష్ట్రంలోని ఏ ప్రాంతం వారికైనా అత్యవసర పరిస్థితిలో ఉన్నట్లయితే సమూహాన్ని సంప్రదించినట్లయితే వారికి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడుతామన్నారు. కార్యక్రమంలో రోగి బంధువులు మిథున్‌, సతీష్‌, టెక్నీషియన్‌ ఏసు గౌడ్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article