Breaking News

భూములు గుంజుకుంటే ఉద్యమిస్తాం

కామారెడ్డి, జూలై 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం సిపిఎం పార్టీ అద్వర్యంలో కామారెడ్డి మండలం గూడేం గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల‌ను, ప్రభుత్వం జెండాలు పాతిన భూముల‌ను సందర్శించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకట్‌ గౌడ్‌తో పాటు జిల్లా కమిటీ సభ్యులు చంద్రశేఖర్‌, రైతుల‌తో కలిసి సందర్శించారు.

అనంతరం వారు మాట్లాడుతూ గూడేం గ్రామంలో 49 సర్వేనెంబర్‌లో 1000 పైగా ఎకరాల‌లో 500 కుటుంబాల‌ రైతులు గత 80 సంవత్సరాలుగా 3 గ్రామాల‌కు చెందిన రైతులు సాగు చేసుకుంటున్నారన్నారు. గూడేం, అరెపల్లి, శాబ్దపూర్‌ గ్రామాల‌ రైతులు సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అదికారులు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల‌ని చూస్తుందని, రైతులు సాగు చేసుకున్న భూముల్లో ఎర్ర జెండాలు పాతారు.

గ్రామ ప్రజల‌కు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ప్రజలు, రైతులు అవేదన చెందుతున్నారు. రెవెన్యూ వారు పాతిన జెండాలు ప్రకారం ఒక ప్రాంతం లోని ఇండ్లు 60 నివాస ఇండ్లు కూడా పోతున్నాయని, ఈ భూముల‌ను పరిశ్రమల‌ ఏర్పాటు కోసం సర్వే చేస్తున్నామని కొందరు అదికారులు ప్రజల‌తో చెప్పారన్నారు.

పచ్చని పంటలు పండిరచే పొలాల‌ను పరిశ్రమల‌కు అప్పగించడం బుద్ధి మాలిన చర్య అని, భూముల‌పై సంబంధించిన అదికారులు అధికార పార్టీ నాయకులు వివరణ ఇవ్వాల‌ని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన రైతులు లింగం, మ‌ల్ల‌య్య, రమేష్‌, బాల్‌రాజు, నర్సయ్య, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

5 నుంచి 14 వరకు లాక్‌డౌన్‌

కామారెడ్డి, ఆగష్టు 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వైరస్‌ వ్యాప్తి నానాటికీ విజృంభిస్తున్నందున ...

Comment on the article