Breaking News

నిజామాబాద్‌ జిల్లాలో దారుణం

నిజామాబాద్‌ కలెక్టరేట్‌, జూలై 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఎడపల్లి మండలం జానకంపేట్‌ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. 8 ఏళ్ళ ఇద్దరు చిన్నారుల‌పై గత 15 రోజులుగా అదే గ్రామానికి చెందిన 55 సంవత్సరాల‌ వృద్ధుడు నారాయణ అత్యాచారం చేస్తున్న ఘటన వెలుగులోకి వచ్చింది. గత 15 రోజులుగా చిన్నారుల‌కు చాక్లెట్లు ఇస్తూ వెంట తీసుకెళ్లి వారిపై అత్యాచారానికి ఒడిగడుతూ ఇంట్లో చెప్పద్దని చిన్నారుల‌ను భయపెడుతూ వచ్చాడు.

చిన్నారుల‌కు ఆరోగ్య సమస్యలు రావడంతో తల్లిదండ్రులు అరా తీయగా విషయం మెగులోకి రావడంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఆదివారం నారాయణను బంధించి దేహశుద్ది చేసి పోలీసుల‌కు అప్పగించారు. నిందితుడు నారాయణను అదుపులోకి తీసుకున్న ఎడపల్లి పోలీసులు, ఇద్దరు చిన్నారుల‌ను చికిత్స నిమిత్తం బోధన్‌ ఏరియా ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు బోధన్‌ సిఐ తెలిపారు.

Check Also

ఏడు కుటుంబాల‌కు కిరాణ సరుకుల‌ పంపిణీ

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 47వ వార్డు కౌన్సిల‌ర్‌ ...

Comment on the article