Breaking News

లోన్లు రికవరీ చేయడం కూడా అంతే ముఖ్యం

నిజామాబాద్‌, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌లో బాంకర్లతో జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్లు, కోవిడ్‌ లోన్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలోన్ల పై మాట్లాడారు. అగ్రిక‌ల్చ‌ర్‌ లోన్ల శాతం తక్కువగా ఉన్నదని, దీనిని పెంచి రైతుల‌కు సకాలంలో ఉపయోగపడేలా చూడాల‌న్నారు.

అదే విధంగా కోవిడ్‌ లోన్‌తో పాటు మరి కొన్ని ప్రభుత్వ లోన్లు కొన్ని బ్యాంకులు ఇవ్వడం లేదని, లేదా అతి తక్కువగా ఇస్తున్నారని బ్యాంకుల‌ వారీగా సమీక్షించారు. లోన్లు ఇవ్వడం ఎంత ముఖ్యమో వాటిని రికవరీ చేయడం కూడా ముఖ్యమేనని, ప్రభుత్వ సబ్సిడీ ఎక్కువగా ఉన్నప్పటికీ, బ్యాంకు లోన్‌ ఇవ్వడం లేదని, వీలైనంత ఎక్కువ మందికి లోన్లు ఇవ్వాల‌ని, లోన్లు పెండిరగ్‌ లేకుండా చూడాల‌ని, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ లోన్లు చాలా పెండిరగ్‌ వున్నవని వాటిని క్లియర్‌ చేయాల‌న్నారు. సమావేశములో కే.నగేష్‌, నాబార్డ్‌ బ్యాంక్‌, జెసన్‌, ఎల్‌డిఎం, డీఆర్‌డివో రమేష్‌ రాథోడ్‌, వివిధ బ్యాంకుల‌ ప్రతినిధులు పాల్గొన్నారు.

Check Also

నత్త నడక పనుల‌పై కలెక్టర్‌ అసహనం

నిజామాబాద్‌, జూలై 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు ...

Comment on the article