Breaking News

ఆ రెండు క‌ల్లు దుకాణాల‌తో కష్టాలు

నిజామాబాద్‌, జూలై 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగర ప్రజల‌కు అసౌకర్యం కలిగిస్తున్న క‌ల్లు దుకాణం ఇక్కడి నుండి తొల‌గించి మరోచోటకు మార్చాల‌ని 7 వ వార్డు కార్పొరేటర్‌ సుక్కమధు జిల్లా కలెక్టర్‌కు మంగళవారం విన్నవించారు. నగర నడిబొడ్డున రెండవ, మూడవ క‌ల్లు దుకాణాల వ‌ల్ల‌ ఇక్కడి మహిళలు, విద్యార్థులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన కలెక్టర్‌కు వివరించి వినతి పత్రం సమర్పించారు.

నిత్యం రాకపోకలు కొనసాగించే ముఖద్వారం ఇరువైపులా ఉండడం వల‌న కాల‌నీలోకి వెళ్లే తమకు ముఖ్యంగా విద్యార్థుల‌పై వీటి ప్రభావం ఎక్కువగా పడుతుందని మధు పేర్కొన్నారు. రాత్రి సమయంలో పీకల‌ లోతు వరకు మద్యం సేవించి, తాగిన మైకంలో ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన చేయడం వ‌ల్ల‌ ఇక్కడ నడవలేని పరిస్థితి ఉందన్నారు. కొందరు జులాయిలు ప్యాకెట్లలో క‌ల్లు తీసుకుని చిన్న రంద్రం చేసి బాటసారుల‌పై చిమ్మిస్తు ఎగతాళి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మహిళలు, పిల్లలు రాత్రి సమయంలో ఎవరైనా తోడు లేకుండా ఇక్కడి ప్రాంతాల్లో నడవడం కష్టంగా ఉందన్నారు. తాగి పడేసిన సీసాలు గుచ్చుకొని అనారోగ్యం పాల‌వుతున్నారన్నారు. సమస్య పరిష్కారం కాకపోతే ఇల్లు అమ్ముకొని వేరే ప్రాంతానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పారు. రెండు క‌ల్లు దుకాణాల‌ను మరోచోటికి మార్చాల‌ని విజ్ఞప్తి చేశారు.

Check Also

వక్ఫ్‌బోర్డు మార్గదర్శకాలు పాటించాలి

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్‌ బోర్డు సూచించిన ...

Comment on the article