Breaking News

Daily Archives: July 8, 2020

రూరల్‌ నియోజకవర్గంలో కలెక్టర్‌ పర్యటన

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని మోపాల్‌ మండంలో జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి బుధవారం పర్యటించారు. ఇందులో భాగంగా ఠానా ఖుర్డు, కాస్‌ బాగ్‌ తాండ, మోపాల్‌, మంచిప్ప గ్రామాల‌ను ఆకస్మికంగా సందర్శించారు. గ్రామాల‌లో పర్యటించి వైకుంఠధామం, కంపోస్టు షెడ్‌, డంపింగ్‌ యార్డ్‌, రైతు వేదికలు, విలేజ్‌ పార్క్‌, ఆర్‌అండ్‌బి రోడ్ల వెంబడి బోర్గాం నుండి మంచిప్ప వరకు ఏవిన్యూ ప్లాంటేషన్‌ పరిశీలిస్తూ నిర్మాణంలో ఉన్న పల్లె ప్రగతి పనుల‌ పురోగతి పరిశీలించారు. ...

Read More »

పోడు భూములు సాగుచేసుకోనివ్వాలి

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూముల‌ను సాగుచేసుకొనివ్వాల‌ని పట్టా పాస్‌ పుస్తకాలు ఇవ్వాల‌ని కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలో భారత కమ్యూనిస్టు పార్టీ మరియు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతుల‌తో తహసీల్దార్‌ కార్యాల‌యం ముందు బుధవారం నిరసన వ్యక్తం చేసి ఆర్‌ఐ వేణుకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి ఎల్‌.దశరథ్‌ మాట్లాడుతూ రామరెడ్డి మండలంలో పేద రైతులు పోడు భూముల‌ను 50 సంవత్సరాలుగా సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారన్నారు. ...

Read More »

‘ఆల‌న’ ప్రారంభం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్‌ జిల్లాలో అసంక్రమిక వ్యాధుల‌ నివారణలో భాగంగా ‘ఆల‌న’ కార్యక్రమాన్ని జిల్లా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి చేతుల‌ మీదుగా బుధవారం జెండా ఊపి ప్రారంభించారు. బాల్కొండ సామాజిక ఆరోగ్య కేంద్రంగా మరియు పిహెచ్‌సిలు కమ్మర్‌పల్లి, చౌట్‌పల్లి, వేల్పూర్‌, కిసాన్‌నగర్‌, మెండోరా, మోర్తాడ్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌లో ఒక వాహనం ద్వారా వైద్య బృందం దీర్ఘకాలిక వ్యాధులు‌ ఉండి మంచం పట్టిన రోగుల‌కు చికిత్స చేయడం జరుగుతుందన్నారు. ...

Read More »

పరీక్ష ఫీజు గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో 2016 సంవత్సరంలో అడ్మిషన్‌ తీసుకున్న మరియు అంతకన్నా ముందు అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థుల‌కు సప్లమెంటరీ పరీక్ష ఫీజు జూలై 31 వరకు పొడగించినట్టు కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2017లో అడ్మిషన్‌ తీసుకున్న విద్యార్థుల‌కు 5వ, 6వ సెమిస్టర్‌ పరీక్ష ఫీజు కూడా జూలై 31 వరకు పొడిగించినట్టు తెలిపారు. మరిన్ని వివరాల‌కు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో సంప్రదించాల‌న్నారు. పరీక్ష ఫీజు ఆన్‌లైన్‌ ...

Read More »

జూలై 25 వరకు పూర్తిచేస్తాం

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్పల్లి మండలం, దుబ్బాక గ్రామంలో వైకుంఠ ధామాన్ని గ్రామంలోని దాతల ‌సహకారంతో అన్ని హంగుల‌తో, అత్యంత సుందరంగా తీర్చిదిద్దుతామని, ఇది మండలానికి ఒక మాడల్‌గా తయారుచేసి జులై 25వ తేదీ వరకు పూర్తి చేస్తామని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి సర్పంచ్‌ శిరసు వెంకటేష్‌ వివరించారు. దీనికి దుబాయ్‌లో నివాసం ఉంటున్న దుబ్బాక గ్రామస్థుల‌ వారి ఆర్థిక సహాయంతో వైకుంఠ రథం, స్థానికులు జగన్మోహన్‌ రెడ్డి సహకారంతో 10 శవర్లు మరియు ...

Read More »

అర్హత పరీక్ష గడువు పెంపు

నిజామాబాద్‌, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఎలాంటి విద్యార్హత లేకున్నా 18 సంవత్సరాల‌ వయసు నిండిన వారు డిగ్రీలో ప్రవేశం పొందే ప్రవేశ అర్హత పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జూలై 31 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజనల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే డిగ్రీ బిఏ, బికాం, బిఎస్‌సిలో ప్రవేశం పొందేందుకు జూలై 31 వరకు అడ్మిషన్‌ పొందవచ్చన్నారు. అదేవిధంగా పిజి ...

Read More »

పేద ప్రజల‌ గుండె చప్పుడు వైఎస్‌ఆర్‌

కామారెడ్డి, జూలై 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్‌ అభిమానులు, కార్యకర్తల‌ ఆధ్వర్యంలో వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు వై యస్‌ రాజశేఖరరెడ్డి అని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండు సార్లు బాధ్యతలు స్వీకరించి తన సంక్షేమ పథకాల‌తో ప్రజల‌ గుండెల్లో ఇప్పటికి చెరగని ముద్ర వేసుకున్నారని, సుదీర్ఘ పాదయాత్ర ద్వారా ప్రజల‌ కష్టాల‌ను తెలుసుకుని ఆ కష్టాల‌నే సంక్షేమ పథకాలుగా ...

Read More »