Breaking News

పశువుల‌కు వ్యాధి నివారణ టీకాలు

నందిపేట్‌, జూలై 18

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా నందిపేట మండలంలోని తొండకురు గ్రామంలో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో శనివారం పశువుల‌కు గాలికుంటు వ్యాధి నివారణ శిబిరం నిర్వహించారు. ఇందులో 220 గేదెలు, ఆవులు 20, మొత్తం 240 టీకాలు వేశారు.

ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి మాట్లాడుతూ ప్రభుత్వం ఉచితంగా అందజేస్తున్న గాలికుంటు వ్యాధి టీకాల‌ను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కార్యక్రమంలో సర్పంచు దేవన, జిల్లా విద్య క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళి, పశువైద్య సిబ్బంది సత్యం, రమణ, రఫీకు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article