Breaking News

గాంధారి లాక్‌ డౌన్‌

గాంధారి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోన మహమ్మారి విస్తరిస్తున్నందున గాంధారిలో చాలా పాజిటివ్‌ కేసులు నమోదై ఉన్నాయని, ఇంకా పాజిటివ్‌ కేసులు వస్తూనే ఉన్నాయని గాంధారి గ్రామ పంచాయతీ పాల‌కవర్గ సభ్యులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆదివారం జరిగిన సమావేశంలో గాంధారి నిత్యావసరాల‌ వస్తువుల‌ దుకాణ సముదాయాల‌ వారు, వర్తక వాణిజ్య సంఘాల‌ వారు స్వతహాగా గాంధారి పాల‌కవర్గంతో పాటు గ్రామాభివృద్ధి కమిటీతో కలిసి పలు తీర్మానాలు చేశారు.

దుకాణ సముదాయాలు జూలై 21వ తేదీ నుంచి ఆగష్టు 1 వరకు పది రోజుల‌ పాటు పూర్తిగా మూసి ఉంచడం జరుగుతుందన్నారు. ప్రజా అవసరాల‌ దృష్ట్యా శనివారం నాగుల‌ పంచమి ఉండడం వల‌న నిత్యావసరాల‌ సరుకులు తీసుకోవడానికి సోమవారం 20వ తేదీ అన్ని దుకాణ సముదాయాలు తెరిచి ఉంచనున్నట్టు పేర్కొన్నారు. దయచేసి మండల‌ ప్రజలు, గ్రామస్తులు పది రోజులు వరుస బంద్‌ పాటిస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాల‌ అభివృద్ధికి సహకరిస్తారని, మహమ్మారిని తరిమి కొట్టడానికి సహకరిస్తారని కోరారు.

అలాగే సోమవారం జరిగే వారాంతపు సంత, దుకాణాలు వ్యాపారాలు పూర్తిగా రద్దు చేయడం జరిగిందన్నారు. అంటే ఆదివారం కూడా సంపూర్ణ బంద్‌ ఉంటుందని అన్నారు. దుకాణ సముదాయాల‌ వారు ఎవరైనా గ్రామపంచాయతీ పాల‌కవర్గం మరియు గ్రామ అభివృద్ధి కమిటీ వారి నిర్ణయాల‌ను ఉల్లంఘించినట్లయితే దుకాణ సముదాయాలు తెరిచి ఏవైనా వస్తువులు అమ్మితే రెండు వేల‌ నుండి 5 వేల‌ వరకు జరిమానా విధించబడుతుందని వివరించారు.

ఖరీఫ్‌ సీజన్‌ సందర్భంగా రైతులు ఇబ్బంది పడకూడదని రైతుల‌కు సంబంధించిన ఫర్టిలైజర్‌ షాపులు మరియు పురుగు మందుల‌ షాపులు ఉదయం 8 గంటల‌ నుండి 11 గంటల‌ వరకు మాత్రమే తెరిచి ఉంచబడుతుందని, అందరు సహకరించాల‌ని తీర్మానించారు.

Check Also

మాతు సంగెంలో కుస్తీ పోటీలు

గాంధారి, ఏప్రిల్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలంలోని మాతుసంగెం గ్రామంలో సోమవారం కుస్తీపోటీలు నిర్వహించారు. ...

Comment on the article