Breaking News

వినతలు డబ్బాలో వేయాలి

నిజామాబాద్‌, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ నేపథ్యంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని, ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అర్జీలు సమర్పించడానికి అధికారుల‌ వద్దకు వెళ్లవద్దని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ప్రజల‌కు విజ్ఞప్తి చేసారు.

ఆదివారం జిల్లా కలెక్టర్‌ ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం కరోనా వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దు చేసినట్టు, ప్రజలు తమ వినతులు, అర్జీలు రాతపూర్వకంగా సమర్పించేందుకు కలెక్టరేట్‌ ఆవరణంలో ఒక డబ్బా ఏర్పాటు చేయడం జరిగిందని, తమ తమ వినతులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ డబ్బాలో వేయాల‌ని లేదా ఇంటి నుండే ఈ మెయిల్‌ ద్వారా dronzb11@gmail.com కు పంపిస్తే సంబందిత శాఖa అధికారుల‌కు పంపి పరిష్కారానికి చొరవ చూపిస్తామని తెలిపారు.

కోవిడ్‌ వేగంగా విస్తరిస్తున్నదని, ప్రతిఒక్కరు అవసరమైతే తప్ప బయటికి రావద్దని, మాస్కులు ధరిస్తూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాల‌ని, సానిటైజర్‌ ఉపయోగించాల‌ని, తరచూ చేతులు శుభ్రం చేసుకోవాల‌ని, వాక్సిన్‌ వచ్చే వరకు కరోనా బారిన పడకుండా కాపాడుకోవాల‌ని కోరారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article