Breaking News

మానవత్వానికి ప్రతీకలు రక్త దాతలు

కామారెడ్డి, జూలై 19

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి రక్తదాతల‌ సమూహం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఆదివారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ నుండి రక్తం సకాలంలో దొరకక పోవడంతో గర్భిణీ స్త్రీలు ఇబ్బంది పడుతున్నారని, వారికి సకాలంలో రక్తాన్ని అందించాల‌నే ఉద్దేశంతో ఈ నెల‌లో రెండవసారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించామన్నారు.

25 మంది యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. కరోనా వ్యాధి ఉద్ధృతంగా ఉన్న ప్రస్తుత సమయంలో మానవతా దృక్పథంతో తోటివారికి సహాయం చేయాల‌ని మంచి ఉద్దేశంతో రక్తదానం చేయడానికి ముందుకు రావడం సమాజంలోని మానవత్వపు విలువల‌కు అద్దం పడుతుందన్నారు.

గత మూడు నెల‌ల కాలంలో సమూహం ద్వారా 175 యూనిట్ల రక్తాన్ని సేకరించి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న గర్భిణుల‌కు అందించి వారి ప్రాణాలు కాపాడామన్నారు. ఈ సందర్భంగా రక్త దాతల‌కు ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో సభ్యులు కిరణ్‌, రాజు, సంతోష్‌ గౌడ్‌ రాము, నవీన్‌ టెక్నీషియన్‌ చందన్‌ పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article