Breaking News

జనావాసాల్లో సంచరించరాదు

ఎల్లారెడ్డి, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోజు రోజుకి కరోనా వైరస్‌ విజృంభిస్తుండడంతో నివారించేందుకు 24 గంటలు వైద్యులు, నాయకులు అందుబాటులో ఉంటారని ఎల్లారెడ్డి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ అన్నారు. వైరస్‌ బారిన పడిన బాధితుల‌ కోసం హోమ్‌ క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సురేందర్‌ గారు, జిల్లా కలెక్టర్‌ శరత్‌తో, డీఎంహెచ్‌ఓ అధికారుల‌తో సోమవారం చరవాణిలో మాట్లాడారు.

పాజిటివ్‌ వచ్చిన బాధితులు జనావాసాల్లో సంచరించరాదని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్ర మోహన్‌ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు, శానిటైజర్‌ు వినియోగించాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సత్యనారాయణ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీంద్ర మోహన్‌, మత్తమాల‌ పిహెచ్‌సి వైద్యుడు వెంకటస్వామి, మున్సిపల్‌ కమిషనర్‌ ఖమర్‌ అహ్మద్‌, కౌన్సిల‌ర్లు రాము, సాయిలు, శ్రీను, నాయకులు విద్యాసాగర్‌, ఇమ్రాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

ఆసుపత్రి మూసివేత

నిజామాబాద్‌, ఏప్రిల్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో నిష్కల్‌ న్యూరో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ...

Comment on the article