Breaking News

మీ ప్రవర్తన వ‌ల్ల‌ యూనియన్‌కు చెడ్డపేరు వస్తుంది

కామారెడ్డి, జూలై 20

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో సోమవారం సిరిసిల్ల‌ రోడ్డులో ఆంజనేయ కిరాణం షాప్‌ తెరుచుకొని సరుకులు అమ్ముతున్నట్టు సమాచారం తెలిసింది. వెంటనే కామారెడ్డి కిరాణా వర్తక సంఘం యూనియన్‌ అధ్యక్షుల‌తో పాటు సభ్యులు వెళ్ళి షాపు యజమాని వినయ్‌తో మాట్లాడారు.

కిరాణ షాప్‌లో అడ్డగోలుగా ధరలు పెంచి అమ్ముతున్నారని ప్రజల‌ ఫిర్యాదు చేశారన్నారు. కావున దుకాణం మూసి ఉంచాల‌ని, మీ లాంటి వారి వ‌ల్ల‌ యూనియన్‌కు చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు. అలాగే యూనియన్‌లో ఐక్యత లేదని ప్రజల‌కు సంకేతం వెళుతుందని కిరాణా వర్తక సంఘం అధ్యక్షుడు ఎల్లంకి శ్రీనివాస్‌ అన్నారు.

ఇకనైనా కిరాణా షాపులు ఎక్కడన్న గల్లీలో తెరుచుకున్న, సరసమైన ధరల‌కు సరుకులు విక్రయించాల‌ని లేనిచో ప్రజలు కిరాణా షాపుల‌పై నమ్మకం కోల్పోతారని, దీనిని దృష్టిలో పెట్టుకుని కిరాణా వర్తక సంఘం యజమానులు ప్రజల‌ సౌకర్యార్థం విక్రయాలు జరపాల‌ని కోరారు. అలాగే 18 వ తేదీ నుండి 26వ తేదీ ఆదివారం వరకు కిరాణా షాపులు బంద్‌ ఉంచాల‌ని కిరాణా వర్తక సంఘం నిర్ణయించడం జరిగిందని అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులు తెలిపారు.

Check Also

సర్వే ద్వారా భూముల ‌పరిష్కారం

కామారెడ్డి, ఏప్రిల్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాయింట్‌ సర్వే ద్వారా రెవెన్యూ, అటవీ భూముల‌ సమస్యల‌ ...

Comment on the article