Breaking News

Daily Archives: July 22, 2020

నాలుగైదు పనులు గుర్తించాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ క్రింద ప్రభుత్వ శాఖలు పనుల‌ను గుర్తించి, ఎస్టిమేట్లు తయారు చేసి సమర్పించాల‌ని, మంజూరు ఉత్తర్వులు తీసుకుని పనులు వెంటనే ప్రారంభించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం ఇర్రిగేషన్‌, ఆర్‌అండ్‌బి, పంచాయతీ రాజ్‌ శాఖ ఇంజనీరింగ్‌ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇర్రిగేషన్‌ శాఖ ఇప్పటివరకు 403 పనులు, రోడ్లు, భవనాల‌ శాఖ 412 పనుల‌ను గుర్తించాయని, పంచాయతీ రాజ్‌ శాఖ కేవలం 9 పనులు గుర్తించినదని, ...

Read More »

ఎటువంటి కొరత రానివ్వము

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : యూరియాకు ఎటువంటి కొరత రానివ్వమని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. మంగళవారం మంత్రి ఒక ప్రకటన విడుదల‌ చేస్తూ రైతులు యూరియా గురించి ఎలాంటి ఆందోళన, ఆత్రుత చెందరాదని, జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి చొరవతో మన జిల్లాకు అవసరమైన యూరియా కొరత లేకుండా సేకరిస్తున్నామని, రైతులు తగినంత, అవసరం ఉన్నంత వరకే యూరియా కొనుగోలు చేయాల‌న్నారు. ప్రస్తుతం మన జిల్లాలో 18 ...

Read More »

భక్తుల‌కు గమనిక…

ఆర్మూర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కరాళ నృత్యం చేస్తున్న వేళ భీంగల్‌ నృసింహ స్వామి ఆల‌యానికి ఈనెల‌ 23 నుంచి ఆగష్టు 20 వ తేదీ వరకు భ‌క్తుల‌ను అనుమతించడం లేదని ఆల‌య నిర్వాహకులు పేర్కొన్నారు. భీమ్‌గల్‌ గ్రామం, మండల‌ చుట్టుపక్కల‌ గ్రామాల్లో కరోనా విస్తరిస్తున్నందున దేవాదాయ శాఖ, రెవెన్యూ, పోలీసువారి సూచన మేరకు కొండ మీదికి భక్తుల‌ను అనుమతించబోమని పేర్కొన్నారు. స్వామివారి భక్తులు తమ తమ ఇళ్లలోనే స్వామివారిని ఆరాధించాల‌ని చెప్పారు. తిరిగి ఆల‌యం ఆగష్టు ...

Read More »

వైకుంఠధామం పనులు త్వరగా పూర్తిచేయాలి

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణ్‌ ఖేడ్‌ మండలంలోని కొండాపూర్‌ గ్రామ పంచాయతీ పరిధిలోగల‌ వైకుంఠధామం నిర్మాణ పనుల‌ను నారాయణఖేడ్‌ జడ్పీటీసీ ల‌క్ష్మీ బాయి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల‌లో జరుగుతున్న వైకుంఠధామం పనుల‌ను త్వరిత గతిన పూర్తి చేయాల‌ని కాంట్రాక్టర్లకు సూచించారు. ప్రజలందరూ కరోనా మహమ్మారి నుంచి జాగ్రత్త వహించాల‌ని సూచించారు. ఆమె వెంట నాయకులు రవీందర్‌ తదితరులు ఉన్నారు.

Read More »

అనుభవాలు పంచుకోవడానికి రైతు వేదికలు

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా లో రైతు వేదికల‌ నిర్మాణాలు ఆగస్టు 15 లోగా పూర్తి చేయాల‌ని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ కుమార్‌ తెలిపారు. బుధవారం కలెక్టర్‌ కామారెడ్డి మండలంలోని చిన్న మల్లారెడ్డి, రాజంపేట్‌, తల‌మడ్ల, తిప్పాపూర్‌, బిక్కనూర్‌ గ్రామాల్లో రైతు వేదికల‌ భవన నిర్మాణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 104 రైతు వేదికల‌ భవనాల‌ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయని చెప్పారు. పనులు నాణ్యతగా జరిగేలా చూడాల‌ని, ...

Read More »

సాహసాల‌ నిధి మహాకవి దాశరథి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాహసం అనేది కలం యోధుల ల‌క్షణమని, ప్రజల‌ పక్షాన కవిత్వాన్ని రాయడం వారి విధి అని మహాకవి దాశరథి నిరూపించారని హరిదా రచయితల‌ సంఘం అధ్యక్షుడు ఘనపురం దేవేందర్‌ అన్నారు. బుధవారం కేర్‌ డిగ్రీ కళాశాల‌లో నిర్వహించిన దాశరథి 96వ జయంతి సందర్భంగా నివాళి కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జైలు గోడల‌ను మహాకావ్యంగా మార్చిన నిరంతర అక్షర తపస్వి దాశరథి అని, సాహసాల‌ నిధి అని ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాల్గొన్న ...

Read More »

విద్యార్థుల‌కు పుస్తకాలు పంపిణీ

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నారాయణ్‌ ఖేడ్‌ మండలంలోని జిల్లా పరిషత్‌ బాలికల‌ ఉన్నత పాఠశాల‌లో ఉచిత పాఠ్యపుస్తకాల‌ను జడ్పీటీసీ ల‌క్ష్మీ బాయి రవీందర్‌ నాయక్‌, రాష్ట్ర బంజారా సేవాలాల్‌ సంఘం అధ్యక్షుడు రమేష్‌ చౌహన్‌, జిల్లా ఎస్‌సి, ఎస్‌టి విజిలెన్స్‌ కమిటీ మెంబర్‌ రవీందర్‌ నాయక్‌, ఎంఈఓ విశ్వనాధ్‌ కలిసి విద్యార్థుల‌కు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు వారి ఇంటి వద్ద పాఠ్యపుస్తకాల‌ను చదువుకోవాల‌ని కోరారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు.

Read More »

50 పడకలు సిద్ధం చేయాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ న్యాల్కల్‌ రోడ్‌లోగల‌ ఈఎస్‌ఐ హాస్పిటల్‌ను బుధవారం జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో కరోనా పాసిటీవ్‌ వచ్చిన వారికి చికిత్స అందించటానికి 50 పడకలు మరియు అవసరమైన డ్రగ్స్‌ అతి త్వరలో ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో ముందు ముందు కరోనా పేషెంట్లు ఎక్కువయితే ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో చికిత్స అందించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. ...

Read More »

అవసరమున్న రోగుల‌కు అందివ్వాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెడ్‌ క్రాస్‌ సంస్థకు సంబంధించిన కొత్త అంబులెన్స్‌ వాహనాన్ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు. బుధవారం కలెక్టరేట్‌ ప్రాంగణంలో రెడ్‌ క్రాస్‌ కొత్త అంబులెన్స్‌ను రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. అంబులెన్స్‌తో ప్రజల‌కు మరింత చేరువ కావాల‌ని, రక్తదానం క్యాంపులు నిర్వహించి, సేకరించిన రక్తాన్ని అవసరమున్న రోగుల‌కు అందివ్వాల‌ని తెలిపారు. రెడ్‌క్రాస్‌ మిగులు డబ్బుతో అంబులెన్స్‌ వాహనం కొనుగోలు చేసినందుకు కలెక్టర్‌ జిల్లా రెడ్‌ క్రాస్‌ ...

Read More »

చిన్నారికి రక్తదానం

కామరెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తల‌సేమియా వ్యాధితో చికిత్స పొందుతున్న 1 సంవత్సరం పాపకు అత్యవసర సమయంలో అంజయ్య రక్తదానం చేశారు. గాంధారికి చెందిన 1 సంవత్సరం పాప మౌనిక తల‌సేమియా వ్యాధితో కామారెడ్డి ఆర్‌కె హాస్పిటల్‌లో చికిత్స పొందుతుంది. చికిత్స నిమిత్తం బి పాజిటివ్‌ రక్తం అవసరముందని టీజీవిపి నాయకుల‌ను సంప్రదించారు. టీజీవిపి రాష్ట్ర కార్యదర్శి ఏనుగందుల‌ నవీన్‌ స్పందించి కామారెడ్డికి చెందిన అంజయ్యతో రక్తదానం చేయించారు. అంజయ్య స్వచ్చందంగా రక్తదానం చేసి తన సేవ దృక్పథాన్ని ...

Read More »

ఎక్కడ పడితే అక్కడ వేయకూడదు

నిజాంసాగర్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని బూర్గుల్‌ గ్రామపంచాయతీ కార్యాల‌యంలో రెండో విడత గ్రామస్తుల‌కు చెత్తబుట్టల‌ను సర్పంచ్‌ సవేర బేగం, పంచాయతీ కార్యదర్శి సుధారాణి కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ మాట్లాడుతూ గ్రామ ప్రజలు చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకూడదని చెత్త రిక్షాలో, టాక్టర్‌లో వేయాల‌న్నారు. గ్రామంలో మన పరిసరాలు మనం ప్రతి ఒక్కరం పరిశుభ్రంగా ఉంచుకోవాల‌ని సూచించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల‌ని, అత్యవసరం అయితే తప్ప బయటకు ...

Read More »

కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలి

కామారెడ్డి, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్‌ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో కలిపి ల‌క్ష కేసులు దాటాయి, అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని, ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేక పేదలు, మధ్య తరగతి ప్రజలు ప్రాణాల‌ మీద ఆశలు వదులుకున్నారని ఎం సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం బాన్సువాడ కార్యదర్శి నగేష్‌ అన్నారు. తక్షణం తెలంగాణ ప్రభుత్వం మరియు నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా వైరస్‌ బాధితుల‌కు ఆరోగ్యశ్రీ ...

Read More »

రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి

నిజామాబాద్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా విజృంభిస్తోందని, జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని, దీనికి తగ్గట్లు ప్రజలు రోగనిరోధక శక్తి పెంచుకునేలా అవగాహన కల్పించాల‌ని, ప్రజలు భయపడ రాదని, అలాగే అజాగ్రత్తగా అస్సలు ఉండరాదన్న విషయాల‌పై ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారుల‌కు సూచించారు. మంగళవారం జిల్లాలోని వైద్య అధికారులు, ఆర్డీవోలు, ఎంపిడివోలు, ఎంపిఒల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో అన్ని రకాల‌ సౌకర్యాలు కల్పించామని, వైద్యుల‌కు భద్రతా ...

Read More »

కొత్త పుస్తకాలొచ్చాయ్‌….

నందిపేట్‌, జూలై 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం షాపూర్‌ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో బాల‌బాలికల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని, కరోన విస్తరిస్తుండడంతో పాఠశాల‌లు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల‌కు విద్యను అందించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. తల్లిదండ్రులు ...

Read More »