Breaking News

కొత్త పుస్తకాలొచ్చాయ్‌….

నందిపేట్‌, జూలై 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బుధవారం నందిపేట మండలం షాపూర్‌ గ్రామ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో బాల‌బాలికల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి ఆధ్వర్యంలో పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉండి చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని, కరోన విస్తరిస్తుండడంతో పాఠశాల‌లు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్నారు.

ఈ సందర్భంగా విద్యార్థుల‌కు విద్యను అందించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని తెలిపారు. తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి విద్యార్థుల‌పై ప్రత్యేక దృష్టి సారించి పిల్ల‌లు చదువుకునే విధంగా సహకారం అందించాల‌ని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శర్మ, అన్నపూర్ణ, చైర్మన్‌ భోజన, టిఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు లింబగౌడ్‌, జిల్లా విద్యా క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళి, గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

పొన్నాల బాల‌య్యకు డాక్టరేట్‌

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యంలోని హిందీ విభాగపు పరిశోధకులు మరియు ప్రముఖ ...

Comment on the article