Breaking News

Daily Archives: July 23, 2020

రీ సైక్లింగ్‌ దినచర్యగా సాగాలి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పారిశుధ్యం, అవెన్యూ ప్లాంటేషన్‌ రెండూ సరైన రీతిలో నిర్వహించినప్పుడే పంచాయతీ సెక్రెటరీల‌కు మరియు మండల‌ అధికారుల‌కు మంచి పేరు వస్తుందని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, ఎంపిడివోలు, ఎంపీవోలు, పంచాయతీ సెక్రెటరీల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. గ్రామాల్లో హరితహారం కార్యక్రమంలో భాగంగా రోడ్ల పక్కన నాటిన మొక్కల‌ను పరిరక్షించే బాధ్యత గ్రామ వన సేవకుల‌దేనని, పంచాయతీ సెక్రెటరీలు వారిని ...

Read More »

చర్చల‌కు వేదికలు

కామారెడ్డి, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట సాగు చర్చల‌కు వేదికలుగా కర్షకుల‌కు కానుకలుగా రైతు వేదికలు ఉపయోగపడతాయని కామరెడ్డి జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం కాసంపల్లి, షాబ్దిపూర్‌, ఇస్రోజివాడి, రామారెడ్డి మండలం అన్నారం, కన్నాపూర్‌ గ్రామాల్లో గురువారం ఆయన రైతు వేదిక భవనాల‌ నిర్మాణం పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లోని అన్నదాతలందరూ ఒకే చోట చేరి పంటల‌ సాగు విధానంపై చర్చించుకునేందుకు రైతు వేదికలు దోహదపడతాయని సూచించారు. పనులు ...

Read More »

పుస్తకాలు సద్వినియోగం చేసుకోవాలి

ఎల్లారెడ్డి, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎల్లారెడ్డి ఆదర్శ పాఠశాల‌లో గురువారం పదవ తరగతి విద్యార్థుల‌కు ఉచిత పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ ఛైర్మన్‌ కుడుముల‌ సత్యం, ఎస్‌ఎంసి వైస్‌ ఛైర్మన్‌ లావణ్య, పాఠశాల‌ ప్రిన్సిపాల్‌ సాయిబాబా, అధ్యాపకులు శ్రీనివాస్‌, వసంత్‌ తదితరులున్నారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉంటూ చక్కగా చదువుకోవాల‌ని సూచించారు.

Read More »

పాఠ్య పుస్తకాల‌ పంపిణీ

నందిపేట్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం తొండకురు గ్రామ జిల్లా పరిషత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో బాల‌బాలికల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉంటు చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కరోన విస్తరిస్తుండడంతో పాఠశాల‌లు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్న సందర్భంగా విద్యార్థుల‌కు విద్యనందించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు కొంత ...

Read More »

జన్మదిన శుభాకాంక్షలు

హైదరాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి గురువారం తన జన్మదినం పురస్కరించుకుని మినిస్టర్‌ క్వార్టర్స్‌లో రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ మరియు శాసనసభ వ్యవహారాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆయనకు పుష్పగుచ్ఛం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాల‌తో నిరంతరం ప్రజాసేవలో కొనసాగాల‌ని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచారం భాస్కర్‌ రెడ్డి మంత్రి వేముల‌కు మొక్కను బహుకరించారు.

Read More »

సీనియర్‌ కాంగ్రెస్‌ నేత వెంకులు మృతి

నిజామాబాద్‌, జూలై 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకులు, ఐఎన్‌టియుసి అధ్యక్షుడు వెంకులు మృతి అత్యంత బాధాకరమని మాజి ఎంపి మధుయాష్కీ గౌడ్‌ విచారం వ్యక్తం చేశారు. వెంకులు మృతి కాంగ్రెస్‌ పార్టీకీ, వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. తను రాజకీయాల‌కు రాకమునుపే వెంకులు మంచి మిత్రుడని, రాజాకీయాల‌కు వచ్చిన నుండి ప్రతి ఎన్నికలో తనతో ఉంటూ తన గెలుపునకు అహర్నిశలు కృషి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. ఐఎన్‌టియుసి నేతగా కార్మికుల‌ హక్కుల‌ ...

Read More »