Breaking News

పాఠ్య పుస్తకాల‌ పంపిణీ

నందిపేట్‌, జూలై 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం నందిపేట మండలం తొండకురు గ్రామ జిల్లా పరిషత్తు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల‌లో బాల‌బాలికల‌కు స్థానిక మూడు గ్రామాల‌ ఎంపీటీసీ సభ్యురాలు మద్దుల‌ రాణిమురళి ఆధ్వర్యంలో పుస్తకాలు పంపిణీ చేశారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు ఇంట్లోనే ఉంటు చదువు నేర్చుకునే విధంగా పుస్తకాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.

కరోన విస్తరిస్తుండడంతో పాఠశాల‌లు ప్రారంభం కాక విద్యార్థులు ఇంట్లోనే ఉంటున్న సందర్భంగా విద్యార్థుల‌కు విద్యనందించాల‌ని ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించడం జరిగిందన్నారు.

తల్లిదండ్రులు కొంత సమయం కేటాయించి విద్యార్థుల‌పై ప్రత్యేక దృష్టి వహించి పిల్ల‌లు చదువుకునే విధంగా సహకారం అందించాల‌ని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం శ్రీనివాసు, రమణ, చైర్మన్‌ వినోద, జిల్లా విద్యా క్రీడల‌ కార్యదర్శి మద్దుల‌ మురళి, పాఠశాల‌ సిబ్బంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Check Also

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు పంపిణీ

నందిపేట్‌, జూలై 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం తొండకూరు గ్రామంలో ముఖ్యమంత్రి సహాయనిధి సీఎంఆర్‌ఎఫ్‌ ...

Comment on the article