Daily Archives: August 1, 2020

నీట మునిగి ఒకరు మృతి

నిజాంసాగర్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో దారుణం జరిగింది. నీట మునిగి ఊపిరాడక ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన జిల్లాలోని నిజాంసాగర్‌ మండలం మర్పల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ రాజలింగం కథనం ప్రకారం.. మర్పల్లి శివారులో గల న‌ల్ల‌వాగులో ఏర్పాటు చేసిన వ్యవసాయ బోరు మోటర్లు తీసేందుకు తోటి రైతుల‌తో భూపతి సాయిలు (40) నీటిలో దిగాడు. ఆ సమయంలో ప్రవాహం ఎక్కువగా ఉండటంతో వాగులో చిక్కుకున్నాడు. నీటి ఉధృతి పెరగడంతో ఊపిరాడక మృతి ...

Read More »

కరోనా నుంచి ప్రపంచాన్ని రక్షించుమని ప్రార్థన

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బక్రీద్‌ సందర్భంగా మాజీ మంత్రి, మాజీ మండలి ప్రతిపక్ష నేత మహమ్మద్‌ అలీ షబ్బీర్‌ తన సొంత ఇంట్లో కుటుంబ సభ్యుల‌తో మాత్రమే పండగ చేసుకొని ప్రార్థనలు చేశారు. బక్రీద్‌ పండుగ ప్రార్థనలు చేసి కరోనా మహమ్మారితో దేశ ప్రజల‌ను, ప్రపంచాన్ని కాపాడాల‌ని దేవుని ప్రార్థించారు. కరోనాతో ఆరు నెల‌ల నుండి పనులు దొరకక ఉపవాసాలు, బాధల‌తో ఎంతో మంది అతలాకుతల‌మవుతున్నారని, వారందరు కరోనా మహమ్మారి నుంచి దేశాన్ని, ప్రపంచాన్ని కాపాడాల‌ని నమాజ్‌ ...

Read More »

కామారెడ్డి ప్రజల‌కు తెలియజేయునది…

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రజల‌కు తెలియజేయునది ఏమనగా, ప్రస్తుతం కరోనా వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉన్నందున, జిల్లా యంత్రాంగం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ప్రత్యామ్నాయాంగా ప్రజలు తమ సమస్యల‌ను తెలుపుకొనుటకు, ప్రతి సోమవారం ఉదయం 10.45 గంటల‌ నుండి 12.15 గంటల‌ వరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఫోన్‌ ఇన్‌ ప్రోగ్రాం నిర్వహిస్తారు. కావున జిల్లా ప్రజలు తమ తమ సమస్యల‌ను జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం టెలిపోన్‌ నెంబరు 08468-220252 కు ...

Read More »

యాంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఛైర్మెన్‌గా నెహాల్‌

కామారెడ్డి, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంటీ కరప్షన్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా రాష్ట్ర ఛైర్మెన్‌గా కామరెడ్డికి చెందిన మహమ్మద్‌ నెహాల్‌ అహ్మద్‌ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు అవినీతి నిర్మూల‌నలో తన వంతు కృషి చేస్తానని నెహాల్‌ తెలిపారు.

Read More »

వారిది పెద్ద మనసు

నిజామాబాద్‌, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్‌జి ఫౌండేషన్‌ వ్యవస్థాపకురాలు తెలంగాణ ప్రముఖ జానపద గాయని రెల‌రే గంగా తమ పెద్ద మనసు చాటుకున్నారు. న‌ల్ల‌గొండ జిల్లా నకిరేకల్‌ మండల‌ గ్రామ పంచాయతీలో ఆటో డ్రైవర్‌ కదిరే సైదులు వారి తల్లి, భార్యా ముగ్గురు చిన్న పిల్ల‌లు కరోనాతో పోరాడుతున్న విషయం తెలుసుకొని జాగృతి నకిరేకల్‌ నియోజకవర్గ ఇంఛార్జ్‌ డా.టిజి లింగం గౌడ్‌ ద్వారా నిత్యవసర సరుకులు అందజేశారు. నిత్యం గ్రామ ప్రజల‌కు సేవ‌లు అందిస్తున్న ఆ కుటుంబ సభ్యులు ...

Read More »

వృద్ధాశ్రమంలో పండ్ల పంపిణీ

వర్ని, ఆగష్టు 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌, రాష్ట్ర ఐటి సెల్‌ అధ్యక్షుడు మదన్‌ మోహన్‌ రావ్‌ పుట్టినరోజు వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కూనీపూర్‌ రాజారెడ్డి ఆధ్వర్యంలో చింతకుంట అనాథ వృద్ధాశ్రమంలో పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ మదన్‌ మోహన్‌ రావు ఎంతో మంది యువకుల‌కు ఉపాధి అవకాశాలు కల్పించారని, జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రతి పట్టణం, ప్రతి ...

Read More »