Breaking News

Daily Archives: August 7, 2020

15న ప్రమాణాలు చేయించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గందగీ ముక్తి భారత్‌ (జిఎంబి) కార్యక్రమంలో భాగంగా ఈ నెల‌ 8 నుండి వారం రోజుల‌ పాటు ప్రజల‌కు పారిశుద్యంపై అవగాహన కలిగించేందుకు వారోత్సవాలు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ మండల‌ అభివృద్ధి అధికారుల‌ను ఆదేశిస్తూ మార్గదర్శకాలు జారీ చేశారు. ఆగష్టు 8 వ తేదీన సర్పంచ్ల‌‌తో సమావేశాలు నిర్వహించాల‌ని, 9 వ తేదీన సర్పంచ్‌ ఆధ్వర్యంలో ప్లాస్టిక్‌ వ్యర్థాలు సేకరించాల‌ని, వాటి నుండి ఒకసారి ఉపయోగించే ప్లాస్టిక్‌ను వేరు చేయడంపై ...

Read More »

మద్యం దుకాణాలు తెరవడం సరికాదు

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో గుడి, బడి బంద్‌ ఉన్న వేళ మద్యం దుకాణాలు కూడా మూసివేయాల‌ని కోరుతూ తెలంగాణ విద్యార్ధి పరిషత్‌ టిజివిపి ప్రొబిషనల్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఇన్స్‌పెక్టర్‌ ఎస్‌హెచ్‌వోకు వినతి పత్రం అందజేశారు. అనంతరం జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కరోనా మహమ్మారి విజృంబిసున్న వేళ పట్టణ వాసులందరు స్వచ్ఛందంగా లాక్‌ డౌన్‌ విధించి ఇళ్లకే పరిమితమైన తరుణంలో మద్యం దుకాణాలు తెరిచి ఉంచడం సరికాదన్నారు. అఖిల‌పక్ష ...

Read More »

వేదికల చుట్టూ పచ్చదనం పెంపొందించాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు వేదికల నిర్మాణ పనులు ఈ నెల‌ 25 లోగా పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ పంచాయితీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. శుక్రవారం ఆయన మాచారెడ్డి మండలం భవానీపేట, పాల్వంచ, ఫరీదుపేట ల‌చ్చాపేట గ్రామాల‌లో రైతు వేదికల‌ నిర్మాణ పనుల‌ను పరిశీలించారు. నిర్మాణ పనులు వేగవంతం చేయాల‌ని, ఈ నెల‌ 25 లోగా నిర్మాణాలు పూర్తి కావాల‌ని పంచాయితీరాజ్‌ ఇంజనీర్లను ఆదేశించారు. రైతు వేదికల‌ చట్టూ పచ్చదనం పెంపొందించాల‌ని, పెద్ద మొక్కలు ...

Read More »

కాగిత రహిత పాల‌నలో శిక్షణ

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కాగిత రహిత పాల‌నలో భాగంగా జిల్లా అధికారుల‌కు, సిబ్బందికి ఇ ఆఫీస్‌ ఫైల్‌ మేనేజిమెంట్‌ విధానం శుక్రవారం జనహిత భవన్‌లో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మూడు సెషన్లలో అధికారుల‌కు, సిబ్బందికి దస్త్రాల‌ కంప్యూటరీకరణపై ఎన్‌.ఐ.సి. జిల్లా ఇన్ఫర్మేషన్‌ అధికారి రవి బండి శిక్షణ అందించారు.

Read More »

జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలి

కామారెడ్డి, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా వైరస్‌ ప్రభావం వున్నందున ప్రజావాణికి ప్రత్యామ్నాయంగా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు ప్రతి సోమవారం ఉదయం 10.30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు 08468220044 ఫోన్‌ నెంబర్‌లో సమస్యలు తెల‌పాల‌ని కోరారు. ప్రతి సోమవారం జరిగే ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి జిల్లా అధికారులందరూ తప్పనిసరిగా హాజరు ...

Read More »

వీరిని ఆదర్శంగా తీసుకోవాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్స్‌ ఫలితాల‌లో 296 ర్యాంక్‌ సాధించిన నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ మండలం, మాచర్ల గ్రామానికి చెందిన సచిన్‌ను రాష్ట్ర రోడ్లు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సన్మానించారు. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన వ్యక్తికి 296 ర్యాంకు రావడం చాలా గర్వించదగ్గ విషయమని మంత్రి ఈ సందర్భంగా అన్నారు. భవిష్యత్తులో సివిల్స్‌ అటెండ్‌ అయ్యే వారు వీరిని ఆదర్శంగా తీసుకోవాల‌న్నారు. దళిత కుటుంబంలో పుట్టిన బిడ్డకు ...

Read More »

12 నుంచి రాష్ట్ర వ్యాప్త సమ్మె

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ హమాలీల‌ గత వేతన ఒప్పందం డిసెంబర్‌ 31, 2019 తో ముగిసిందని, జనవరి 1, 2020 నుండి నూతన వేతన ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉందని, దీనికి సంబంధించి ఇప్పటికే అనేక సందర్భాల్లో సివిల్‌ సప్లైస్‌ రాష్ట్ర కమిషనర్‌కి, సివిల్‌ సప్లైస్‌ మినిస్టర్‌కి జిల్లా మేనేజర్లకు వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓమయ్య అన్నారు. శుక్రవారం నిజాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం ...

Read More »

చేనేత మండలి రద్దు సరికాదు

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : చేనేత అభివృద్ధి సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన అఖిల‌ భారత చేనేత మండలి రద్దు సరికాదని నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం అద్యక్షుడు దీకొండ యాదగిరి అన్నారు. నిజామాబాదు జిల్లా పద్మశాలి సంఘం ఆద్వర్యంలో శుక్రవారం కోటగల్లిలోని సంఘ భవనంలో చేనేత దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా నిజామాబాదు నగరానికి చెందిన చేనేత కార్మికుల‌ను సన్మానించారు. అనంతరం యాదగిరి మాట్లాడుతూ చేనేత మండలి రద్దు వ‌ల్ల‌ చేనేత రంగానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని ...

Read More »

15లోపు ప్రారంభం కావాలి

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని అన్ని గ్రామాల్లో చెత్తను విడదీసే ప్రక్రియ ఆగస్టు 15 వ తేదీలోపు మొదల‌వ్వాని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లాలోని ఎంపీవోలు, పంచాయతీ అధికారుల‌తో సెగ్రిగేషన్‌ షెడ్ల నిర్వహణపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో దాదాపు 400 గ్రామ పంచాయతీలో సెగ్రిగేషన్‌ షెడ్లు పూర్తి అయినాయని, మిగిలినవి త్వరలో పూర్తి కానున్నాయని, అన్ని గ్రామ పంచాయితీలో ఆగష్టు 15 తేదీ నుండి తప్పనిసరిగా చెత్తను విడతీసి రీసైక్లింగ్‌కు ...

Read More »

రూ.75 కోట్ల ఆదాయం వచ్చే అవకాశముంది

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముప్కాల్‌ మండలం, నాగపూర్‌ గ్రామ శివారులో శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు రిజర్వాయర్లో సమీకృత చేపల‌ అభివృద్ధి పథకంలో భాగంగా ఉచిత చేప పిల్ల‌ల‌ పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పాల్గొన్నారు. శుక్రవారం మంత్రి ఎస్‌ఆర్‌ఎస్‌పిలో ఉచిత చేప పిల్ల‌ల‌ విడుదల‌ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంవత్సరం రాష్ట్ర వ్యాప్తంగా ...

Read More »

త్వరలో ప్రారంభం….

నిజామాబాద్‌, ఆగష్టు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న నూతన సమీకృత కలెక్టరేట్‌ కార్యాల‌య నిర్మాణ పనుల‌ను రాష్ట్ర రోడ్లు-భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజల‌ ముంగిటకే పాల‌న వెళ్లాల‌న్న ఉద్దేశంతో అధికార వికేంద్రీకరణలో భాగంగా 10 జిల్లాలున్న తెలంగాణలో 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి 33 జిల్లాల తెలంగాణగా చేశారన్నారు. అలా ఏర్పడిన జిల్లాలో ప్రజల‌ సౌకర్యార్థం ప్రభుత్వ ఫలాలు ఒకే ...

Read More »