Daily Archives: August 10, 2020

ఫోన్‌ ఇన్‌లో 52 ఫిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యం జనహిత భవన్‌లో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి జిల్లా నలుమూలల‌ నుంచి 52 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. వీటిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 13, పారిశుద్ధ్య సమస్యకు సంబంధించి 10, పింఛన్లు 3, తాగునీరు 4, రోడ్ల సమస్య గురించి 13, వ్యవసాయం సంబంధించి సమస్యల‌పై 10 చొప్పున ఫిర్యాదులు వచ్చినట్లు పేర్కొన్నారు. సమస్యల‌ పరిష్కారానికి సంబంధిత శాఖల‌ అధికారులు త్వరితగతిన కృషి చేయాల‌ని పేర్కొన్నారు. కార్యక్రమంలో ...

Read More »

పల్లె ప్రకృతి వనం పనులు ప్రారంభం

నిజాంసాగర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పల్లె ప్రకృతి వనం పనుల‌ను సర్పంచ్‌ సంధ్యారాణి ప్రారంభించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సంధ్యారాణి, నాయకులు పండరి, గ్రామ పెద్దలు తదితరులు ఉన్నారు.

Read More »

కార్యవర్గం ఎన్నిక

నిజాంసాగర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని ఐకెపి కార్యాల‌యంలో సమాఖ్య మహాజన సభ నిర్వహించారు. ఇందులో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా రుద్ర, అంజవ్వ (కొమలంచ), ఉపాధ్యక్షుగా కె,మొగుల‌వ్వ (మాగి), కార్యదర్శిగా నాగమణి, మొహమ్మద్‌ నగర్‌, జాయింట్‌ సెక్రెటరీ శాంతవ్వ, (మగ్దంపూర్‌) ల‌త (షేరాన్‌ పల్లి) వీరిని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఐకెపి ఏపియం రాంనారాయణ గౌడ్‌, ఆయా గ్రామ సంఘాల‌ ప్రజా ప్రతినిధు తదితరులు ఉన్నారు.

Read More »

క్రీడల‌లో రాణించాలి

నిజాంసాగర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని వడ్డేపల్లి గ్రామకార్యాల‌యం వద్ద సర్పంచ్‌ సంధ్యారాణి- పండరీలు కలిసి మహాత్మా హెల్పింగ్‌ హాండ్స్‌ స్వచ్చంద సేవా సంస్థ ద్వారా గ్రామ యువకులు క్రీడల‌లో రాణించాల‌నే సంక‌ల్పంతో, గ్రామ యువకుల‌ను క్రీడల‌లో ప్రోత్సహించాల‌నే ఉద్దేశ్యంతో వాలీబాల్‌, నెట్‌లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ యువకులు సర్పంచ్‌ సంధ్యారాణి, పండరీకి, మహాత్మా హెల్పింగ్‌ హాండ్స్‌ వ్యవస్థాపకులు గంటా రవీందర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సంధ్యారాణి, గ్రామ పెద్దలు, ...

Read More »

1500 క్యూసెక్కుల‌ వరద నీరు చేరుతుంది

నిజాంసాగర్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షాల‌కు పెద్దగుట్ట ,గౌరారం గండివేట్‌, కోనాపూర్‌ తదితర ప్రాంతాల‌ నుంచి వచ్చిన వరద నీటితో సింగీతం మత్తడి పొంగి పొర్లి షేరాన్‌ పల్లి మత్తడి పొంగి పొర్లుతూ సింగీతం ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ఉధృతి పెరుగుతుంది. జలాశయం లోకి దాదాపు 1500 క్యూసెక్కుల‌ వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ ...

Read More »

ఫూలే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి

నిజామాబాద్‌, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ జిల్లా కమిటీ అధ్యక్షుడిగా విశ్రాంత బ్యాంకు అధికారి బిట్ల రత్నయ్య ఎన్నికయ్యారు. ఈ మేరకు పీపుల్స్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్ట్‌ కేంద్ర కమిటీ చైర్మన్‌ సి.హెచ్‌.బాల‌కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ సోమవారం ఒక ప్రకటన విడుదల‌ చేశారు. అధ్యక్షుడిగా రత్నయ్య, ఉపాధ్యక్షుడిగా రాసరి పెంటన్న, ప్రధాన కార్యదర్శిగా సి.హెచ్‌.సాయులు, సహాయ కార్యదర్శిగా ఉదయ కుమార్‌, కోశాధికారిగా ఆర్‌.నరసయ్య, కార్యవర్గ సభ్యులుగా బాస రాజేశ్వర్‌ను నియమించినట్లు వారు వివరించారు. భారతరత్న ...

Read More »

జన్మదినం సందర్భంగా రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన గడ్డం సంపత్‌ బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కామారెడ్డి రక్తదాతల‌ సమూహం పిలుపుమేరకు తన జన్మదినాన్ని పురస్కరించుకొని పట్టణంలోని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌లో సోమవారం రక్త దానం చేశారు. ఈ సందర్భంగా నిర్వాహకుడు బాలు మాట్లాడుతూ గత నాలుగు నెల‌లుగా బ్లడ్‌ బ్యాంకుల్లో రక్త నిలువ‌లు తక్కువగా ఉన్నాయని కరోనా వైరస్‌ కారణంగా రక్తదాతలు రక్తదానం చేయడానికి ముందుకు రావడం లేదని ...

Read More »