Breaking News

Daily Archives: August 12, 2020

అవసరమైనన్ని రాపిడ్‌ ఆంటీజేన్‌ కిట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో అవసరమైనన్ని రాపిడ్‌ ఆంటీజేన్‌ కిట్లు అందుబాటులో ఉన్నాయని, మున్సిపాలిటీల్లో కమిషనర్లు మొబైల్‌ కోవిడ్‌ టెస్టింగ్‌ వాహనాల‌ను ఏర్పాటుచేసుకొని, గ్రామాల‌లో ఆర్డీవోలు వైద్య సిబ్బందితో కోఆర్డినేట్‌ చేసుకొని కోవిడ్ ల‌క్షణాలున్న ప్రతి ఒక్కరికి టెస్టులు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అన్నారు. బుధవారం ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, తహశీల్దార్లు, వైద్యాధికారుల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో మాట్లాడుతూ జిల్లాకు 10 వేల‌ 400 కొత్త రాపిడ్‌ టెస్టింగ్‌ కిట్లు అందాయని, ఇప్పటికే అందుబాటులో ఉన్న ...

Read More »

వారం రోజుల్లో పూర్తిచేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో ఇప్పటివరకు మంజూరు చేసిన 511 పల్లె ప్రకృతి వనాలు వారం రోజుల్లో ప్రభుత్వం జారీచేసిన మార్గదర్శకాల‌ ప్రకారం పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ సి. నారాయణరెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్‌ సీఈఓ, డీఆర్డిఓ, డిపిఓ, ఏపీవోలు, ఎంపిడివోలు, ఎంపీవోల‌తో నిర్వహించిన సెల్‌ కాన్ఫెరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఇప్పటికే చాలా సమయం ఇవ్వడం జరిగిందని, పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ముందుకు వెళ్లాల‌ని, మార్గదర్శకాల‌ను వంద శాతం పాటిస్తూ పల్లె ...

Read More »

5 కరోన కేసుల‌ నిర్ధారణ

నిజాంసాగర్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలో నవోదయ విద్యాల‌యంలో ఇద్దరు, సింగీతం గ్రామంలో ఇద్దరు, అవుసుల‌ తండాలో ఒకరికి బాన్సువాడ ప్రభుత్వ హాస్పటల్‌లో ఆర్‌ టి పి ఆర్‌ టెస్టులు చేయగా కరోన నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన కేసులు 26 కాగా వీరిలో కోలుకున్న వారు ముగ్గురు అని తెలిపారు.

Read More »

కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పంద్రాగస్టు

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు, 15 స్వాతంత్య్ర దినోత్సవం రోజున రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జిల్లా కలెక్టరేటులో జాతీయ పతాకావిష్కరణ గావిస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. బుధవారం జనహితలో జిల్లా అధికారుల‌తో స్వతంత్ర దినోత్సవం రోజున నిర్వహించే కార్యక్రమాల‌పై సమీక్షించారు. తమకు నిర్దేశించిన కార్యక్రమాల‌ను పూర్తి చేసుకోవాల‌ని ఆదేశించారు. ఆగష్టు 15 న ఉదయం 10 గంటల‌కు జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి జాతీయ పతాకావిష్కరణ ...

Read More »

ప్రభుత్వాలు అలా సూచించలేదు…

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ కార్యాల‌యంలో బుధవారం రాబోయే వినాయక ఉత్సవాల‌ గురించి ముఖ్య కార్యకర్తల‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న నేపథ్యంలో విశ్వ హిందూ పరిషత్‌ సూచన మేరకు గత సంవత్సరం లాగానే ప్రతి యువజన సంఘం వాళ్ళు తక్కువ ఎత్తు గల‌ వినాయకుల‌ను ప్రతిష్టించి, భక్తి శ్రద్దల‌తో పూజలు ...

Read More »

రక్తదాత.. ప్రాణదాత…

కామారెడ్డి, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రామారెడ్డి మండల‌ కేంద్రానికి చెందిన శిరీష (26) గర్భిణీ రక్తహీనతతో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో బాధ పడడంతో వారు కామారెడ్డి రక్తదాతల‌ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి వ్యవసాయ విస్తరణాధికారి అశోక్‌ రెడ్డి సహకారంతో బి నెగిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ బి నెగిటివ్‌ గ్రూపు రక్తం పదివేల‌ మందిలో 300 ...

Read More »

సమ్మె ప్రారంభం

నిజామాబాద్‌, ఆగష్టు 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సివిల్‌ సప్లై హమాలి యూనియన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా నిరవధిక సమ్మెను బుధవారం నుండి ప్రారంభించినట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై ఓ మయ్య తెలిపారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ మండల‌ స్టాకిస్టు పాయింట్‌ వద్ద ఓమయ్య సమ్మెకు సంఫీుభావం తెలుపుతూ మాట్లాడారు. కార్మికుల‌ సమస్యలు పరిష్కరించాల‌ని, బస్తా రేటు 18 నుండి 24 పెంచాల‌ని, ఈఎస్‌ఐ సౌకర్యం కల్పించాల‌ని, తెలంగాణ ప్రభుత్వ ముద్రతో గుర్తింపు కార్డులు ...

Read More »