Breaking News

మంచి భోజ‌నం అందించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌ మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల‌ను జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. గురువారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా మాక్లూర్‌ కోవిడ్‌ ఐసోలేషన్‌ సెంటర్‌, పి హెచ్ సిల‌ ను సందర్శించిన సందర్భంగా మాట్లాడారు.

ఐసోలేషన్‌ సెంటర్‌ వద్ద అంబులెన్స్‌ ఎ్లప్పుడూ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, 108 అందుబాటులో లేకుంటే ప్రైవేటు అంబులెన్స్‌ ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఐసోలేషన్‌ సెంటర్లో డాక్టర్‌ అందుబాటులో ఉండాల‌ని, వచ్చే వారికి 108 లేదా ప్రైవేట్‌ అంబులెన్స్‌ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, పేషెంట్స్‌ పెరిగితే సిబ్బందిని ఇంకా ఇస్తామని తెలిపారు.

ఐసోలేషన్‌ సెంటర్‌లో ఉన్నవారికి భోజనం మంచిగా ఇవ్వాల‌ని, అవసరాన్ని బట్టి బెడ్స్‌ పెంచాల‌ని, జిల్లాలోని ఏ ప్రాంతం నుండైన ఐసోలేషన్‌ సెంటర్‌కు ఫోన్‌ కాల్‌ వస్తే వెంటనే అంబులెన్స్‌ ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోవాల‌ని, ఐసోలేషన్‌ సెంటర్‌ నుండి వెళ్లే వారికి కూడా అంబులెన్స్‌ సౌకర్యం కల్పించాల‌న్నారు. ఐసోలేషన్‌ సెంటర్లో శానిటేషన్‌ చేయించాల‌ని, సెంటర్‌ ముందు ఖాళీ స్థలంలో ప్లాంటేషన్‌ చేయించాల‌ని ఎంపిడిఓను ఆదేశించారు. అనంతరం పిహెచ్‌సిని సందర్శించారు. కోవిడ్‌ పరీక్ష రేపిడ్‌ టెస్ట్‌ కిట్లను పరిశీలించారు.

ల‌క్షణాలున్నవారిని తప్పనిసరిగా పరీక్షలు చేయాల‌ని, రోజువారి పరీక్షలు పెంచాల‌ని వైద్యుల‌ను ఆదేశించారు. నిజామాబాద్‌ ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్లో హైదరాబాద్‌ ప్రైవేట్‌ హాస్పిటల్లో కరోనా వైద్యానికి అందించే మందుతో ట్రీట్మెంట్‌ అందిస్తున్నామని తెలిపారు. పర్యటనలో కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ ఆంజనేయులు, ఎంపీడీవో చక్రియ నాయక్‌, డాక్టర్‌ సంజీవరెడ్డి, పిఆర్‌ ఏఈ తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article