Breaking News

ప్రారంభోత్సవానికి సిద్ధం

కామారెడ్డి, ఆగష్టు 13

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బీర్కూర్‌ మండలం రైతు నగర్‌లో వంద శాతం పూర్తయిన రైతు వేదిక భవనాన్ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సందర్శించారు. రైతు వేదిక భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. భవన నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేసినందుకు సర్పంచ్‌ నాగేశ్వరరావు ను జిల్లా కలెక్టర్‌ అభినందించారు. పల్లె ప్రకృతి వనం ను పరిశీలించారు. నాటిన మొక్కల‌ వివరాను అడిగి తెలుసుకున్నారు.

అంతకుముందు బాన్సువాడ మండలం సోమేశ్వర్‌లోని రైతు వేదిక నిర్మాణం పనుల‌ను జిల్లా కలెక్టర్‌ పరిశీలించారు. పనులు త్వరితగతిన పూర్తి చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి నరేశ్‌, పంచాయతీ రాజ్‌ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article