Breaking News

Daily Archives: August 16, 2020

విద్యుత్‌ వినియోగదారుల‌కు గమనిక

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపిలేని వర్షాల‌ కారణంగా మీ దగ్గరలో కాని మీ ఇంటిలో కాని ఎలాంటి విద్యుత్‌ పరికరాల‌ను తడి చేతితో తాకకండని, మీ దగ్గరలోని ఆరుబయట విద్యుత్‌ స్థంభాల‌ను ఎవ్వరూ తాకవద్దని విద్యుత్‌శాఖ హెచ్చరికలు జారీచేసింది. మీ కనుచూపు మేర ఎక్కడైనా విద్యుత్‌ తీగలు తెగిపడిన వెంటనే మీ ఏరియా కరెంటు ఆఫీసుకి కాని మీ యొక్క లైన్‌ మెన్‌కు కాని లేదా మీ ఏ.ఇ.కి కాని సమాచారం అందించి ప్రమాదాల‌ను నివారించండని విద్యుత్‌శాఖ ...

Read More »

రైతు ఇలా చేయాలి…

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంగా రైతు తమ పంటల‌ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల‌ని జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 50 వేల‌ ఎకరాల‌లో పత్తి పంట, 14 వేల‌ ఎకరాల‌లో మినుములు, 8 వేల‌ ఎకరాల్లో పెసర్లు సాగు చేస్తున్నట్లు తెలిపారు. న‌ల్ల‌రేగడి నేల‌లో నీరు నిలువ ఉండకుండా నీరు బయటకు వెళ్ళేలా చర్యలు తీసుకోవాల‌ని సూచించారు. రెండు మూడు రోజుల‌లో మినుములు, పెసర్లు పంటల‌కు ...

Read More »

కూలిపోతున్న ఇళ్ళకు పరిహారం ఇవ్వాలి

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా గత ఐదుల‌ రోజుల‌ నుండి కురుస్తున్న వర్షాల‌ కారణంగా పట్టణంలో, గ్రామాల‌లో కూలిపోతున్న ఇండ్లను విచారణ జరిపి పరిహారం అందించే విధంగా జిల్లా కలెక్టరు రెవెన్యూ అధికారుల‌కు, గ్రామ పంచాయతి అధికారుల‌కు ఆదేశాలు ఇవ్వాల‌ని ఎం సిపిఐయు పార్టీ డిమాండ్‌ చేస్తుందని పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాల‌యంలో నిర్వహించిన విలేకరుల‌ సమావేశంలో మాట్లాడారు. తాత్కాలికంగా కూలిన ఇళ్ళ‌కు రూ. 50 వేలు, పూర్తిగా ...

Read More »

తప్పిదాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని లోతట్టు ప్రాంతాల‌ ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ జనహితలో ఆదివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారుల‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లోని ముంపు ప్రాంతాల‌ను అధికారులు గుర్తించి, అందుబాటులో ఉండాల‌ని సూచించారు. ప్రజల‌కు ఎలాంటి హానీ జరగకుండా చూడాల‌న్నారు. గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. చెరువులు కట్టలు, అలుగును నిత్యం పర్యవేక్షణ చేయాల‌ని ...

Read More »

జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల‌ని, ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాల‌ని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభ వ్యవహారాలు మరియు హౌసింగ్‌ శాఖా మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌తో కలిసి రెవిన్యూ, పోలీస్‌, ఇర్రిగేషన్‌, పంచాయతీ రాజ్‌, రోడ్లు భవనాలు, వ్యవసాయ, ఫైర్‌, మత్స్య తదితర శాఖల‌ అధికారుల‌తో నిర్వహించిన సెల్‌ ...

Read More »

జన హృదయ నేత అటల్‌జీ

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని, భారతరత్న, బీజేపీ మేరు శిఖరం అటల్‌ బిహారీ వాజపేయి వర్ధంతి సందర్భంగా మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి మాట్లాడుతూ ఆధునిక భారత వ్యాసుడు అఖండ హిందూ రాష్ట్ర యజ్ఞానికి భాజపా అనే హావిస్సు సృషి కర్త నరేంద్రుణి మనకు ప్రసాదించిన దార్శనిక మహా నేత, వల‌స పాల‌నను ...

Read More »