Breaking News

తప్పిదాలు జరగకుండా పర్యవేక్షణ చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 16

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని లోతట్టు ప్రాంతాల‌ ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా అధికారులు చర్యలు చేపట్టాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. కలెక్టరేట్‌ జనహితలో ఆదివారం వీడియో కాన్ఫరెన్సు ద్వారా అధికారుల‌కు పలు ఆదేశాలు జారీ చేశారు. పట్టణాలు, గ్రామాల్లోని ముంపు ప్రాంతాల‌ను అధికారులు గుర్తించి, అందుబాటులో ఉండాల‌ని సూచించారు. ప్రజల‌కు ఎలాంటి హానీ జరగకుండా చూడాల‌న్నారు.

గ్రామస్థాయి అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు. చెరువులు కట్టలు, అలుగును నిత్యం పర్యవేక్షణ చేయాల‌ని కోరారు. గ్రామాల్లో కూలిపోయే ఇండ్లను గుర్తించాల‌ని, వాటిలో నివాసముండే వారిని ప్రభుత్వ పాఠశాల‌ల్లో ఉండే విధంగా చూడాల‌ని కోరారు. వర్షాల‌ కారణంగా పంటలో నీరు నిలిచి ఎదుగుదల‌ లేని వాటిని గుర్తించి రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్త సర్వే చేపట్టాల‌ని పేర్కొన్నారు. సర్వే నివేదికను జిల్లా ఉన్నతాధికారుల‌కు పంపాల‌ని‌ కోరారు. గత ఐదేళ్లలో దెబ్బతిన్న చెరువులు, కుంటలు, రోడ్ల వివరాల‌ను అధికారులు సేకరించి అప్రమత్తంగా ఉండాల‌ని సూచించారు.

ప్రతిరోజు గ్రామాల‌ వారీగా నివేదికలు తెప్పించాల‌ని పేర్కొన్నారు. గజ ఈతగాళ్లు వివరాలు సేకరించాల‌ని కోరారు. చెరువులు తెగిపోయే వాటిని గుర్తించి ముందుగా ఇసుక బస్తాల‌ను సిద్ధం చేయాల‌ని పేర్కొన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లను, పూర్తిగా కూలిన వాటి వివరాలు ఎప్పటికప్పుడు మండల‌ స్థాయి అధికారుల‌కు గ్రామస్థాయి అధికారులు తెలియజేయాల‌ని తెలిపారు. తప్పిదాలు జరగకుండా అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాల‌ని హెచ్చరించారు.

వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తే ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉన్నందున ముందుగానే ఆ గ్రామాల‌ను గుర్తించాల‌ని కోరారు. జిల్లాలో 226 చెరువులు ఉన్నాయని వాటిలో ఇంతవరకు 77 చెరువులు పూర్తిగా నిండాయని చెప్పారు. వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, ఆర్‌డిఓ నరేందర్‌, నీటిపారుదల‌ శాఖ ఈఈ బన్సీలాల్‌, డిపిఓ నరేష్‌, మండల‌ స్థాయి అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article