Daily Archives: August 17, 2020

ఫోన్‌ ఇన్‌లో 30 ఫిర్యాదులు

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి కలెక్టరేట్‌ లో సోమవారం జరిగిన ఫోన్‌ ఇన్‌ కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రెవెన్యూ సమస్యల‌కు సంబంధించి 13, గ్రామ పంచాయతీల‌కు సంబంధించి 4, మండల‌ పరిషత్తుకు 5, వ్యవసాయ శాఖ సంబంధించి 2, మైనారిటీ, విద్యాశాఖకు ఒకటి చొప్పున, మునిసిపల్‌, డిఆర్‌డిఓ శాఖకు 2 రెండు చొప్పున ఫిర్యాదులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, కలెక్టరేట్‌ ఏవో శ్రీనివాస్‌, వివిధ శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Read More »

ప్రజల‌ను అప్రమత్తం చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అధికారులు అప్రమత్తంగా ఉండాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో సోమవారం అధికారుల‌తో ఫోన్‌లో వర్షాల‌పై సమీక్ష నిర్వహించారు. పట్టణాల్లో, గ్రామాల్లో లోతట్టు ప్రాంతాల‌ ప్రజల‌ను అప్రమత్తం చేయాల‌ని సూచించారు. ఎక్కడ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల‌ని పేర్కొన్నారు. గ్రామస్థాయి అధికారులు అందుబాటులో ఉండి వర్షాల‌కు దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలించి, ఇళ్లలో ఉన్న వారిని స్థానిక పాఠశాల‌లో పునరావాస కేంద్రంలో ఉండే విధంగా ...

Read More »

సేంద్రీయ ఎరువుల‌ తయారీ కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆగస్టు 28 లోగా గ్రామాల్లో సేంద్రియ ఎరువుల‌ తయారీ కేంద్రాల‌ను ఏర్పాటు చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఏ.శరత్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్‌ జనహితలో ఉపాధి హామీ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామాల్లో ఎరువుల‌ తయారీ చేపట్టి పంచాయతీల‌కు ఆదాయాన్ని సమకూర్చాల‌ని సూచించారు. పల్లె ప్రకృతి వనంలో 15 శాతం పెద్ద మొక్కలు నాటాల‌ని సూచించారు. పాదచారుల‌కు నడకదారి ఏర్పాటు చేయాల‌ని కోరారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, ఆల‌యాల‌ ...

Read More »

తల్లిదండ్రుల‌ పేరుతో పిపిఇ కిట్ల అందజేత

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి. నారాయణ రెడ్డికి జిల్లా వాసి చంద్రవదన్‌ రావు పిపిఈ కిట్లను అందజేశారు. సోమవారం జిల్లా కలెక్టర్‌ను ఆయన చాంబర్‌లో కలిసిన ఆర్మూర్‌ మండలం మగిడి గ్రామానికి చెందిన చంద్రవదన్‌ రావు 40 వేల‌ రూపాయల విలువచేసే పిపిఈ కిట్లను అందజేశారు. కరోనా బారిన పడిన ప్రజల‌కు తమ ప్రాణాల‌ను ఫణంగా పెట్టి వైద్య సేవ‌లు అందిస్తున్న వైద్యుల‌కు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్ల రక్షణకోసం తన తల్లితండ్రుల‌ పేరుమీద ...

Read More »

యూరియా కొరత లేకుండా చూస్తాము…

నిజాంసాగర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండల‌ కేంద్రంలోని అచ్చంపేట్‌ సొసైటీలో రైతుల‌కు యూరియా బస్తాల‌ను సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, ఏఈవో స్వర్ణల‌తలు కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్బంగా సొసైటీ చైర్మన్‌ మాట్లాడుతూ రైతుల‌కు యూరియా కొరత లేకుండా చూస్తామన్నారు. సోమవారం 450 యూరియా బస్తాలు రైతుల‌కు పంపిణీ చేశామన్నారు. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందకూడదని, కావల‌సిన యూరియాను తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. మంగళవారం ఒక లారీ యూరియా బస్తాలు వస్తాయన్నారు.

Read More »

కోమలంచలో ఒకరికి కరోనా

నిజాంసాగర్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని కోమలంచ గ్రామానికి చెందిన ఒకరికి ర్యాపిడ్‌ టెస్ట్‌ చేయగా కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు మండల‌ వైద్యాధికారి రాధాకిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కరోన 33 కేసులు కాగా అందులో కోలుకున్నవారు 11 మంది, ఇందులో కరోన ఆక్టివ్‌ కేసులు 22 మంది అని తెలిపారు.

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గాంధారి మండలం చద్మల్‌ తండాకు చెందిన శారద (22) సంవత్సరాల‌ వయసు కలిగిన గర్భిణీ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాల‌లో రక్తహీనతతో బాధపడుతుండగా బి పాజిటివ్‌ రక్తం అవసరమైంది. దీంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. పట్టణానికి చెందిన న్యాయవాది మరియు లైన్స్‌ క్లబ్‌ జిల్లా సెక్రెటరీ శ్యామ్‌ గోపాల్‌ రావు మానవతా దృక్పథంతో సకాలంలో స్పందించి వి.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో 61వ సారి బి ...

Read More »

సహాయనిధి చెక్కల అందజేత

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌, రాష్ట్ర ముఖ్యమంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్రశేఖర రావు సహకారంతో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించారు. డిచ్‌పల్లి మండలం ముల్లంగి గ్రామానికి చెందిన మహేష్‌ కుమార్‌కి రూ. 24 వేలు చెక్కును బాజిరెడ్డి యువసేన సభ్యులు నవీన్‌ ఆధ్వర్యంలో అందజేశారు. మోపాల్‌ మండలం ముదక్‌పల్లి గ్రామానికి చెందిన గంగాధర్‌కి రూ. 26 వేలు చెక్కును ...

Read More »

ఏటిఎం ప్రారంభించిన భాస్కర్‌రెడ్డి

వర్ని, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సోమవారం చందూర్‌ మండల‌ కేంద్రంలో నిజామాబాద్‌ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆవరణలో ఏటిఎం కేంద్రాన్ని డీసీసీబీ చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి ప్రారంభించి బ్యాంకును పరిశీలించారు. పిఏసిఎస్‌ సొసైటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కళ్యాణల‌క్షి, షాది ముబారక్‌ చెక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో చందూర్‌ సర్పంచ్‌ కర్లం సాయిరెడ్డి, సొసైటీ చైర్మన్‌ మాధవరెడ్డి, మండల‌ పార్టీ అధ్యక్షుడు అంబరసింగ్‌, అశోక్‌, ల‌క్ష్మపూర్‌ ఎంపీటీసీ శ్యామ్‌ రావు మండలంలోని సర్పంచులు, పార్టీ నాయకులు, ...

Read More »