Breaking News

Daily Archives: August 18, 2020

వరద గేట్లు ఎత్తివేత

నిజాంసాగర్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని సింగీతం ప్రాజెక్ట్‌ జలాశయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల‌కు ప్రాజెక్ట్‌ జలాశయంలోకి వరద వచ్చి చేరడంతో సింగీతం ప్రాజెక్ట్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండిరదని ప్రాజెక్ట్‌ డిప్యూటీ ఈఈ దత్తాత్రి తెలిపారు. ప్రాజెక్ట్‌ ఎగువ భాగంలో గల‌ గండివేట్‌, పెద్దగుట్ట, కోనాపూర్‌, గౌరారం, ముదేలి, తదితర ప్రాంతాల‌లో కురిసిన భారీ వర్షాల‌కు వరద ఉదృతి పెరగడంతో ప్రాజెక్ట్‌ 3 వరద గేట్లను ఎత్తి ...

Read More »

పట్టభద్రులు దరఖాస్తు చేసుకోవచ్చు…

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణలో ఆగ్రోస్‌ ప్రాంతీయ కార్యాల‌యం, నిజామాబాద్‌ జిల్లాలో ఆగ్రో రైతు సేవా కేంద్రాలు అందుబాటులో లేని మండలాల్లో ఆగ్రో రైతు సేవా కేంద్రాలు ఏర్పాటు చేయటానికి ఔత్సాహికులైన వ్యవసాయ, వ్యవసాయ ఇంజనీరింగ్‌, ఉద్యాన పట్ట భద్రులు, డిప్లొమ వ్యవసాయం, ఉద్యాన, సైన్సు పట్టభద్రులు దరఖాస్తు చేసుకోగల‌రని నిజామాబాద్‌ వ్యవసాయాధికారి ఒక ప్రకటనలో కోరారు. రైతుల‌కు విత్తనాలు, ఎరువులు, క్రిమి సంహారక మందులు, వ్యవసాయ పనిముట్లు అందజేసేందుకు ఆయా మండలాల్లో ఆగ్రో రైతు సేవా ...

Read More »

చిట్టడివిగా మార్చాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోచారం ప్రాజెక్టును జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి మట్టం వివరాల‌ను అడిగి తెలుసుకున్నారు. రెండు రోజుల్లో ప్రాజెక్ట్‌ పూర్తిస్థాయిలో నిండే వీలుందని నీటిపారుదల‌ శాఖ అధికారులు తెలిపారు. పోచారం ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయాల‌ని స్థానికులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. అనంతరం పోచారం గ్రామంలోని పల్లె ప్రకృతి వనంను సందర్శించారు. మొక్కలు దగ్గరదగ్గరగా నాటి చిట్టడివిగా మార్చాల‌ని సూచించారు. గ్రామంలోని వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఎంపీపీ రాజు ...

Read More »

అధికారులు అందుబాటులో ఉండాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్షాల‌ కారణంగా పంట నష్టం వివరాల‌ను గ్రామస్థాయి అధికారులు మండల‌ స్థాయి అధికారుల‌కు, జిల్లా స్థాయి అధికారుల‌కు ఎప్పటికప్పుడు తెలియజేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. మంగళవారం ఫోన్‌ ఇన్‌ కార్యక్రమంలో ఆయన అధికారుల‌తో మాట్లాడారు. గ్రామస్థాయిలో కూలిన ఇళ్ళ వివరాల‌ను, దెబ్బతిన్న క‌ల్వ‌ర్టు, రోడ్ల వివరాలు తెలియజేయాల‌ని తెలిపారు. చెరువులు, కుంటల‌ను నీటిపారుదల‌ శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు నిత్యం పర్యవేక్షణ చేయాల‌ని ఆదేశించారు. వీఆర్వోలు, గ్రామపంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ...

Read More »

రెండు ల‌క్షల‌ ఇళ్లలో సర్వే

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా కట్టడికి అన్ని రకాల‌ చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. ఎల్లారెడ్డి మున్సిపల్‌ కార్యాల‌యంలో మంగళవారం జరిగిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో రెండు ల‌క్షల‌ ఇండ్లను సర్వే చేపట్టి వ్యాధులు ఉన్న వారిని గుర్తించామని చెప్పారు. ఆరోగ్య కేంద్రాల‌ పరిధిలో 400 వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా, సీజనల్‌ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ...

Read More »

తెరాస నుంచి ఎం సిపిఐ యులోకి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎం సిపిఐ యు పార్టీ కార్యాల‌యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాచారెడ్డి మండల‌ నాయకులు శ్రీను నాయక్‌, ప్రవీణ్‌, నాయకులు ఎం సిపిఐయు పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించినట్టు జిల్లా కార్యదర్శి రాజలింగం, రాష్ట్ర నాయకుడు శివ, జిల్లా నాయకుడు రవి తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పాల‌న సాగిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్‌ ఉచిత ...

Read More »

20వ తేదీ లోపు అనుమతి తీసుకోవాలి

కామారెడ్డి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం బిబిపెట అఖిల‌ పక్ష సమావేశంలో గణేష్‌ నవరాత్రి ఉత్సవ వేడుకల‌ గురించి ఎస్‌ఆర్‌ఎం గార్డెన్‌లో సమావేశమయ్యారు. కోవిడు నిబంధనలు ఉల్లంఘించకుండా ఎవరైనా గణపతి పెట్టాల‌నుకునే వారు, గణేష్‌ యువజన సంఘాలు మరియు కుల‌ సంఘాలు ఈనెల‌ 20వ తేదీ సాయంత్రం 4 గంటల‌ వరకు గ్రామపంచాయతీ అనుమతి తీసుకోవాల‌ని నిర్ణయించారు.

Read More »