Breaking News

Daily Archives: August 20, 2020

ప్రతిరోజు 1500 టెస్టులు

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతిరోజూ 1500 కోవిడ్‌ టెస్టులు నిర్వహించాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, వైద్య అధికారుల‌ను ఆదేశించారు. గురువారం జనహిత భవన్‌లో జిల్లా వైద్య అధికారి, జిల్లా ఆసుపత్రుల‌ కోఆర్డినేటర్‌ డిప్యూటీ జిల్లా వైద్య అధికారుల‌తో కోవిడ్‌ -19 పరీక్షల‌ కార్యక్రమాన్ని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో 200, బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో 150, ఎల్లారెడ్డి, దోమకొండ, మదునూర్‌ కమ్యూనిటీ హెల్త్‌ ...

Read More »

సెప్టెంబర్‌ 7 లోగా పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని రైతు వేదిక భవనాల‌ను సుందరంగా తీర్చి దిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప ఫంక్షన్‌ హాల్‌లో గురువారం రైతు వేదిక ఏజెన్సీల‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. సెప్టెంబర్‌ 7 లోగా జిల్లాలోని రైతు వేదిక భవనాల‌న్నీ పూర్తి చేయాల‌ని ఏజెన్సీ ప్రతినిధుల‌ను ఆదేశించారు. భవనాల‌ చుట్టూ మొక్కలు నాటాల‌ని సూచించారు. ఆగస్టు 13 వరకు బీర్కూర్‌ మండలం రైతు నగర్‌ రైతు వేదిక భవనాన్ని ...

Read More »

హిందూ పండుగల‌పై ఆంక్షలు తగదు – న్యాయవాది సురేందర్ రెడ్డి

  కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా మహమ్మారి ప్రబలిన నేపథ్యంలో, కరోనాను అడ్డుపెట్టుకొని హిందూ పండుగల‌పై ఆంక్షలు పెట్టడం తగదని న్యాయవాది సురేందర్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఏమతం వారికైనా వారి వారి పండగల‌ను స్వేచ్చగా జరుపుకోవడానికి రాజ్యాంగం హక్కు కల్పించిందని, హక్కుల‌ను కాల‌రాయడానికి ఎటువంటివారికైనా అధికారాలు లేవని స్పష్టం చేశారు. ఇటీవల కాలంలో కరోనా మహమ్మారి పెరిగిన తర్వాత కొన్ని గ్రామాల్లో గణేష్‌ ఉత్సవాల‌పై ఆంక్షలు విధిస్తున్నట్టు కొన్ని వార్తలు వచ్చాయన్నారు. అయితే కొన్ని ...

Read More »

లోన్స్‌ వెంటనే పూర్తి చేయాలి

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్బల్‌ భారత్‌ అభియాన్‌ స్కీం క్రింద మంజూరు చేసిన లోన్స్‌ వెంటనే పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో ఎంఎస్‌ఎంఇ లోన్స్‌ ఇవ్వడంలో పూర్‌ పెరఫార్మెన్సు ఉన్న బ్యాంకర్స్‌తో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ చిన్న, మధ్యతరగతి పరిశ్రమల‌కు అవుట్‌ స్టాండిరగ్‌ లోన్‌ బ్యాలెన్స్‌ అమౌంట్‌పై 20 శాతం ...

Read More »

జలాశయాల్లోకి వరద నీరు రాలేదు

నిజాంసాగర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ ప్రాజెక్ట్‌ జలాశయాన్ని గోదావరి బేసిన్‌ కమిషనర్‌ మధుసూదన్‌ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌ 12,16,20 వరద గేట్లను పరిశీలించారు. ప్రాజెక్ట్‌ లోనికి వరద వచ్చే సమయంలో గేట్లు మొరాయించకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల‌ని నీటిపారుదల‌ శాఖ అధికారుల‌కు ఆదేశించారు. అనంతరం ఆయన విలేకరుల‌తో మాట్లాడుతూ నిజాంసాగర్‌, సింగూర్‌ ప్రాజెక్ట్‌ జలాశయం లోనికి వరద నీరు వచ్చి చేరలేదన్నారు. మంజీర పరివాహక ప్రాంతాల్లో వర్షాలు కురవక పోవడంతో నిజాంసాగర్‌, ...

Read More »

దేశ ప్రజల‌ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారు

బీర్కూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత మాజీ ప్రధాని, స్వర్గీయ రాజీవ్‌ గాంధీ 76వ జన్మదినాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లా బీర్కూర్‌ మండల‌ కేంద్రంలో టీపిసిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అబ్ధుల్‌ అహ్మద్‌, పార్టీ మండల‌ అధ్యక్షుడు పోగు నారాయణ ఆధ్వర్యంలో కాంగ్రేస్‌ పార్టీ శ్రేణుల‌తో కలిసి ఘనంగా నిర్వహించారు. రాజీవ్‌ గాంధీ జన్మదినం సంధర్బంగా ఆయన జీవితంలోని మధుర ఘట్టాల‌ను స్మరించుకున్నారు. రాజీవ్‌ గాంధీ యువత పట్ల ఆయనకున్న విజన్‌, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన కృషి ...

Read More »

మాస్కులు, సానిటైజర్స్‌ పంపిణీ

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రియదర్శిని మహిళా కన్సూమర్స్‌ అసోసియేషన్‌ ఆద్వర్యంలో గురువారం నిజామాబాదు నగరంలోని అశోకా అపార్ట్‌మెంట్‌లో ఇండ్లల్లో పనిచేసే 50 మందికి బియ్యం, సానిటైజర్‌లు, మాస్కులు పంపిణీ చేశారు. అసోసియేషన్‌ అద్యక్షురాలు సిలివేరి నాగమణి అద్యక్షతన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా వ‌ల్ల‌ ఇండ్లల్లో పనిచేసే వారు ఇబ్బందులు పడుతున్నందున సేవా కార్యక్రమం చేపట్టామన్నారు. తమ సంస్థ 1992 నుండి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని చెప్పారు. వైద్య శిభిరాల‌తో పాటు ...

Read More »

వారి శ్రేయస్సే మనకు ముఖ్యం..మన సామాజిక బాధ్యత..

నిజామాబాద్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డి నిజామాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, కామారెడ్డి కలెక్టర్‌ శరత్‌తో ఫోన్లో మాట్లాడారు. తాజా పరిస్థితుల‌పై ఉభయ జిల్లా కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రస్తుతం ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ఆస్కారం ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్‌ సూచించినట్లు అన్ని స్థాయిల‌ అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాల‌ని, ...

Read More »

ఘనంగా రాజీవ్‌గాంధీ జయంతి

కామారెడ్డి, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌య‌ములో భారత రత్న, మాజీ ప్రధాని కీర్తీ శేషులు రాజీవ్‌ గాంధీ 76 వ జయంతి సందర్భంగా చిత్ర పటానికి పూల మాల‌లు వేసి స్మరించుకున్నారు. నిజాంసాగర్‌ చౌరస్తాలో రాజీవ్‌ గాంధీ విగ్రహానికి పూల మాల‌లు వేసి నివాళులు అర్పించారు. రాజీవ్‌ గాంధీ చేసిన ఐటీ, యువకుల‌కు పద్దెనిమిదేండ్లకే ఓటు హక్కు కల్పించారని, డిల్లి నుండి గల్లీవరకు జవహర్‌ రోజ్‌గార్‌ యోజన పథకాన్ని ప్రవేశపెట్టి గ్రామీణ ...

Read More »

సిఎం రిలీప్‌ ఫండ్‌ అందజేత

బీర్కూర్‌, ఆగష్టు 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నసురుల్లాబాదు మండల్‌ సంగం గ్రామానికి చెందిన జర్పుల‌ సుభాష్‌ మరియు సలాబత్‌ వెంకటేష్‌కు మంజూరైన సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును నసురుల్లాబాదు మండల‌ ఎంపీపీ వాలితే విటల్‌ ల‌బ్ధిదారుల‌కు గురువారం అందజేశారు. ఇద్దరు ల‌బ్ధిదారులు కడుపు నొప్పితో ఇబ్బందిపడుతూ వైద్యం కోసం దరఖాస్తు చేసుకోగా సుభాష్‌కు 27 వేల‌ 500 రూపాయ‌లు మరియు వెంకటేష్‌కు 12 వే రూపాయ‌లు మంజూరు కాగా, చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ సాయాగౌడ్‌, టిఆర్‌ఎస్‌ పార్టీ ...

Read More »