Breaking News

పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తాం

కామారెడ్డి, ఆగష్టు 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌ను గ్రామాల్లో ఆహ్లాదకరమైన వాతావరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ శరత్‌ అన్నారు. కామారెడ్డి మండలం గర్గుల్‌లో శుక్రవారం ఆయన పల్లె ప్రకృతి వనం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మియావాకి విధానంలో మొక్కల‌ను దగ్గర దగ్గరగా నాటి చిట్టడివి వాతావరణం కల్పించాల‌ని సూచించారు. నాటిన మొక్కల‌కు క్రమ సంఖ్య కేటాయించడంపై సర్పంచి రవి తేజ గౌడ్‌ను అభినందించారు.

భిక్కనూరు మండలం పెద్ద మల్లారెడ్డిలో కంపోస్ట్‌ షెడ్డు సందర్శించారు. సేంద్రియ ఎరువుల‌ను తయారు చేసి రైతుల‌కు విక్రయించి పంచాయతీకి ఆదాయాన్ని సమకూరుస్తామని అధికారులు పేర్కొన్నారు. భిక్కనూరు మండలం జంగంపల్లిలో పల్లె ప్రకృతి వనంను కలెక్టర్‌ శరత్‌ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పల్లె ప్రక ృతి వనంలో ల‌క్ష్యం మేరకు మొక్కలు లేకపోవడంపై పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం పనులు అసంపూర్తిగా ఉన్నందున ఎంపిఓకు మెమో జారీ చేయాల‌ని డిపిఓ నరేష్‌ను ఆదేశించారు. అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, డిపిఓ నరేష్‌, బిక్కనూర్‌ ఎంపీడీవో అనంతరావు, కామారెడ్డి తహసిల్దార్‌ అమీన్‌ సింగ్‌, ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article