Breaking News

సిఎం సహాయనిది చెక్కుల‌ అందజేత

నిజామాబాద్‌, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలో పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న నిజామాబాద్‌ రూరల్‌ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంజూరు చేయించారు. సిరికొండ మండల‌ కేంద్రానికి చెందిన విజయ ల‌క్ష్మికి 14 వేలు, సిరికొండ మండలం తాళ్ల రామడుగు గ్రామానికి చెందిన ప్రశాంత్‌కి 31 వేలు, జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రానికి చెందిన సుశాంత్‌కి 21 వేలు 500 చెక్కు, దర్పల్లి మండలం రామడుగు గ్రామానికి చెందిన ప్రవీణ్‌కి 50 వేల‌ చెక్కు అందజేశారు.

జక్రాన్‌పల్లి మండల‌ కేంద్రానికి చెందిన లావణ్యకి 20 ‌వేల‌ చెక్కును ధర్పల్లి జడ్పిటిసి సభ్యులు అందజేశారు. ఈ సందర్బంగా బాజిరెడ్డి జగన్‌ మోహన్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎంతో మంది పేద ప్రజల‌ ప్రాణాలు రక్షించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా కోఆర్డినేటర్‌ డికొండ శ్రీనివాస్‌, పడకల్‌ ఎంపిటిసి గంగారెడ్డి, నూడా డైరెక్టర్‌ శ్రీనివాస్‌ రావు, రూపా శ్రీనివాస్‌, కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

కోవిడ్‌ పేషంట్‌ల‌తో మాట్లాడిన కలెక్టర్‌

నిజామాబాద్‌, మే 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆరోగ్య కార్యకర్తలు మీ ఇంటికి ప్రతిరోజు వస్తున్నారా మీకు ...

Comment on the article