Breaking News

కళ్యాణల‌క్ష్మి చెక్కుల‌ పంపిణీ

కామారెడ్డి, ఆగష్టు 26

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి నియోజకవర్గంలోని 752 మందికి 7 కోట్ల 52 ల‌క్షల‌ 62 వేల‌ రూపాయల‌ కల్యాణల‌క్ష్మి, షాది ముభారక్‌ చెక్కుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పంపిణీ చేశారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 వేల‌ 798 మందికి 27.62 కోట్ల రూపాయల‌ చెక్కులు పంపిణీ చేసినట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆడపిల్ల‌ను మగ పిల్ల‌ల‌తో సమానంగా పెంచాల‌న్నారు.

ఆడపిల్ల‌ పుడితే బాధపడే రోజులు పోయాయని, పేదింటి తల్లి దండ్రుల‌కు ఆడపిల్ల‌ పెళ్ళి భారం కాకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కళ్యాణ ల‌క్ష్మి, షాది ముభారక్‌ పథకాలు ప్రవేశపెట్టారన్నారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు, కార్యకర్తలున్నారు.

Check Also

సోమవారం ప్రజావాణి రద్దు

కామారెడ్డి, ఏప్రిల్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కరోనా నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ కార్యాల‌యంలో ప్రతి సోమవారం ...

Comment on the article