వారం రోజుల్లో పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 25

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వారం రోజుల‌లో పల్లె ప్రకృతి వనాల‌ను పూర్తిచేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. బుధవారం ఆయన తాడ్వాయి మండలం కరడ్‌ పల్లి, కన్కల్‌, దెమికాన్‌, గాంధారి మండలం జువ్వాడి, గుర్జల్‌ గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల‌కు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాల‌ని సూచించారు.

దాతల‌ సహకారంతో పల్లె ప్రకృతి వనాల‌ను పచ్చదనంతో కళకళలాడే విధంగా చూడాల‌న్నారు. హరిత హారంలో నాటిన మొక్కల‌ను 100 శాతం సంరక్షణ చేయాల‌ని కోరారు. గ్రీన్‌ బడ్జెట్‌ను వినియోగించుకోవాల‌ని సూచించారు. దెమెకాల‌న్‌లో పల్లె ప్రకృతి వనంలో ల‌క్ష్యానికి అనుగుణంగా మొక్కలు నాటనందున, అవెన్యూ ప్లాంటేషన్‌ మొక్కల‌ సంరక్షణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల‌ని డీఎల్‌పివోను ఆదేశించారు. చెత్త నుంచి సంపదను సృష్టించేందుకు కంపోస్టు షెడ్‌ ఏర్పాటు చేసుకోవాల‌ని, సేంద్రియ ఎరువుల‌ను తయారు చేసి రైతుల‌కు విక్రయించి గ్రామ పంచాయతీలో ఆదాయాన్ని పెంచుకోవాల‌ని కోరారు.

మంకీ ఫుడ్‌ కోర్టుల్లో అల్ల‌నేరేడు, మేడి, సీమ చింత, జామ, దానిమ్మ వంటి పండ్ల మొక్కలు నాటాల‌ని సూచించారు. కన్కల్‌, గురుజల్‌ గ్రామాల్లోని రైతు వేదిక‌ భవనాల‌ నిర్మాణం పనుల‌ను ఆయన పరిశీలించారు. పనుల‌ నిర్వహణలో వేగాన్ని పెంచాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, తాడువాయి ఎంపీపీ రవి, ఎంపీడీవో ల‌క్ష్మి, తహసిల్దార్‌ భుజంగరావు, వ్యవసాయ అధికారి శ్రీకాంత్‌, గాంధారి జడ్పిటిసి సభ్యులు శంకర్‌ నాయక్‌, సర్పంచ్‌ సంజీవ్‌, ఎంపీడీవో నాగరాజు, పంచాయతీరాజ్‌ ఇంజనీర్లు, అధికారులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article