అమరవీరుల‌కు ఘన నివాళి

కామారెడ్డి, ఆగష్టు 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విచ్చల‌విడిగా పెంచిన విద్యుత్‌ ఛార్జీల‌ను తగ్గించాల‌ని 2000 సంవత్సరంలో జరిగిన పోరాటంలో అమరులైన పోరాట అమరవీరుల‌కు ఎంసిపిఐయు పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో అమరవీరుల‌ స్తూపం వద్ద ఘన నివాళులు అర్పించినట్లు పార్టీ జిల్లా కార్యదర్శి రాజలింగం తెలిపారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంకు చెప్పిన విధంగా విచ్చల‌విడిగా విద్యుత్‌ చార్జీలు పెంచితే ఉమ్మడి రాష్ట్రంలోని ప్రజలందరితో పాటు వామపక్ష పార్టీల‌న్నీ ఐక్యంగా రాష్ట్ర రాజధానిలో చేసిన పోరాటంలో చంద్రబాబు విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో మరణించిన అమరవీరుల‌కు ఎంసిపిఐయు పార్టీ ఘన నివాళి అర్పిస్తుందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక రకరకాల‌ పేర్లతో విద్యుత్‌ ఛార్జీల‌ను మళ్లీ దొడ్డిదారిన పెంచుతున్న తెలంగాణ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాల‌ని, పెంచుతున్న విద్యుత్‌ చార్జీల‌ను తక్షణం తగ్గించాల‌ని డిమాండ్‌ చేశారు.

లేనిపక్షంలో కోవిద్‌ 19 అనంతరం చేసే పోరాటాల‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల‌ని స్పష్టం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకుడు జబ్బర్‌, జిల్లా నాయకులు ప్రభాకర్‌ తిరుపతి, సురేష్‌, మద్దెల‌ రాజు, మోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article