వంద శాతం హాజరయ్యేలా చూడాలి

కామరెడ్డి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆన్‌లైన్‌ తరగతుల‌కు విద్యార్థులు వందశాతం హాజరయ్యేలా చూడాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. శనివారం కలెక్టర్‌ చాంబర్లో విద్యాశాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. టీవీలు లేని పేద విద్యార్థుల‌ను గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాల‌యాల్లో పాఠాలు వినే విధంగా చూడాల‌న్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు ప్రతినిత్యం పర్యవేక్షణ చేయాల‌ని సూచించారు.

విద్యార్థుల‌కు ఏమైనా సందేహాలుంటే ఆన్‌లైన్‌ పాఠ్యాంశాలు పూర్తయిన తర్వాత ఉపాధ్యాయుల‌కు ఫోన్‌ చేసి నివృత్తి చేసుకోవాల‌ని కోరారు. ఆన్‌లైన్‌ తరగతుల‌ సమయంలో తల్లిదండ్రులు దూరదర్శన్‌, టీ శాట్‌ చానల్‌ వచ్చే విధంగా చూసుకోవాల‌న్నారు. ఆన్‌లైన్‌ క్లాసుల‌ సమయంలో విద్యుత్‌ సౌకర్యం కల్పించాల‌ని ట్రాన్స్‌కో అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌కు నాణ్యమైన విద్యను అందే విధంగా చూడాల‌న్నారు.

విద్యార్థులు ఆన్‌లైన్‌ తరగతులు వినే విధంగా తల్లిదండ్రులు చూడాల‌ని కోరారు. కరోనా నేపథ్యంలో ఆన్‌లైన్‌ క్లాసుల‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. అదనపు కలెక్టర్‌ యాదిరెడ్డి, అసిస్టెంట్‌ కలెక్టర్‌ హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, డిఈవో రాజు, మండల విద్యాధికారులు, కేబుల్‌ ఆపరేటర్లు పాల్గొన్నారు.

Check Also

నిఘా పటిష్టంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిహద్దు గ్రామాల‌లో రాకపోకల‌పై నిఘా ఏర్పాట్లను పఠిష్టంగా నిర్వహించాల‌ని ...

Comment on the article