బీమా వందశాతం పూర్తిచేయాలి

కామారెడ్డి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పంట బీమా వంద శాతం పూర్తి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టర్‌ చాంబర్లో శనివారం అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఎఈవోలు క్లస్టర్‌ పరిధిలోని రైతులందరికీ భీమా చేయాల‌ని సూచించారు. పంట సాగు వివరాలు ఆన్‌లైన్‌లో వందశాతం నమోదు చేయాల‌ని కోరారు. జిల్లాలో యూరియా కొరత లేకుండా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

పిట్లం మండలంలో 600 మెట్రిక్‌ టన్నుల‌ యూరియా ప్రైవేటు డీల‌ర్ల వద్ద ఉందని, లాక్‌ డౌన్‌ కారణంగా పంపిణీ చేయడంలో జాప్యం జరుగుతుందని వ్యవసాయ అధికారులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. నిలువ‌ ఉన్న యూరియాను సహకార సంఘాల‌కు అప్పగించి రైతుల‌కు పంపిణీ చేయాల‌ని జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డిని ఆదేశించారు. రైతుల‌కు పంట రుణాలు అందే విధంగా వ్యవసాయ అధికారులు చూడాల‌ని పేర్కొన్నారు.

Check Also

సోడియం హైప్లో క్లోరైడ్‌ పిచ్చికారి

కామరెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జ్లి కేంద్రంలో కరోనా కేసులు భారీ సంఖ్యలో ...

Comment on the article