రెండు కళాశాల‌లను ప్రారంభించాలి

కామారెడ్డి, ఆగష్టు 29

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంజూరైన పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లను ప్రారంభించాల‌ని ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌కి బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బహుజన ప్రజాస్వామ్య విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి విఠల్‌ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాకు పాలిటెక్నిక్‌, ఐటిఐ కళాశాల‌లు లేకపోవడం వ‌ల్ల‌ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.

కామారెడ్డి 6 జిల్లాల‌కు కేంద్రంగా ఉందని, ఇక్కడ టెక్నికల్‌ విద్యాసంస్థలు లేకపోవడం వ‌ల్ల‌ ఇతర జిల్లాల‌కు రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు వెళ్ళవల‌సి వస్తుంద‌న్నారు. దూరప్రాంతాల‌కు వెళ్లలేక ఉన్నత విద్యకు పేద విద్యార్థులు దూరం కావాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గతంలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వచ్చామన్నారు.

కామారెడ్డినీ ఎడ్యుకేషన్‌ హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారని, అందులో భాగంగానే ఐటిఐ పాలిటెక్నిక్‌ కళాశాల‌లో గత 3 సంవత్సరాల‌ క్రితం మంజూరు చేశారు కానీ ప్రారంభించలేదన్నారు. ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ చొరవ చూపి ప్రస్తుత విద్యా సంవత్సరం పాలిటెక్నిక్‌ ఐటిఐ కళాశాలల‌ తరగతులు ప్రారంభించాల‌ని కోరారు. కార్యక్రమంలో రాష్ట కార్యదర్శి విఠల్‌, జిల్లా అధ్యక్షుడు స్టాలిన్‌, జిల్లా అధ్యక్షుడు బుల్లెట్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నిఘా పటిష్టంగా నిర్వహించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సరిహద్దు గ్రామాల‌లో రాకపోకల‌పై నిఘా ఏర్పాట్లను పఠిష్టంగా నిర్వహించాల‌ని ...

Comment on the article