Breaking News

Daily Archives: September 1, 2020

తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకృతి వనాల‌తో నూతన శోభ వచ్చిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. సదాశివనగర్‌ మండలం భూంపల్లిలోని పల్లె ప్రకృతి వనంను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాల‌తో పల్లెల్లో నూతన శోభను సంతరించుకోనున్నాయని చెప్పారు. ప్రకృతి వనంలో బెంచీలు ఏర్పాటు చేయాల‌ని సూచించారు. గుట్ట సమీపంలో వాహనాల‌ పార్కింగ్‌ ఏర్పాటు చేయాల‌ని కోరారు. ప్రతి వెయ్యి మొక్కల‌కు ఒక వన సంరక్షకుడు ఏర్పాటుచేసి నెల‌కు ...

Read More »

రాష్ట్రంలో కామారెడ్డి ఫస్ట్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల‌కు రూ.19 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజీ ద్వారా ఇప్పించి రాష్ట్రంలో మొదటి స్థానంలో కామారెడ్డి జిల్లా నిలిచిందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో మంగళవారం ఐకెపి అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోవిడ్‌ రుణాల ల‌క్ష్యం‌ రూ.57 కోట్లకు ఇప్పటివరకు రూ.30 కోట్లు అందజేసినట్లు తెలిపారు. 56 శాతం ల‌క్ష్యాన్ని సాధించినట్లు తెలిపారు. ల‌క్ష్యాన్ని సాధించే విధంగా అధికారులు కృషి ...

Read More »

వైస్‌ ప్రిన్సిపాల్‌గా డాక్టర్‌ శాంతాబాయి

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం ఉపకుల‌పతి సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి నీతూ కుమారి ప్రసాద్‌ ఆదేశానుసారం రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం మంగళవారం తన చాంబర్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా. శాంతాబాయికి నియామక పత్రాల‌ను జారీ చేశారు. తమపై నమ్మకంతో వైస్‌ ప్రిన్సిపల్‌ పదవీ బాధ్యతలు అప్పగించినందుకు ఉపకుల‌పతి, రిజిస్ట్రార్‌కు డా. శాంతాబాయి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు వైస్‌ ప్రిన్సిపల్‌గా బాధ్యతలు స్వీకరించిన డా. శాంతాబాయికి టీయూ అధ్యాపకులు, అధ్యాపకేతరులు, పరిశోధకులు, విద్యార్థులు శుభాకాంక్షలు ...

Read More »

15 తారీఖ్‌ నుంచి పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాల‌యం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాల‌ల‌ ప్రధానాచార్యుల‌తో మంగళవారం పరిపాల‌నా భవనంలోని సమావేశ మందిరంలో పరీక్షల‌ నియంత్రణాధికారి డా. పాత నాగరాజు జూం ఆప్‌లో ఆన్‌ లైన్‌ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం విచ్చేసి అన్ని డిగ్రీ కళాశాల‌లోని చివరి (ఆరవ) సెమిస్టర్‌ విద్యార్థుల‌కు ఈ నె ల 15 వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇటీవల‌ సుప్రీం కోర్టు తీర్పు, యూజీసీ మార్గదర్శకాల‌ను ...

Read More »

దీంతో గ్రామ పంచాయతీకి ఆదాయం వస్తుంది

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందల్వాయి మండలం, సిర్నాపల్లి గ్రామాన్ని ఆకస్మికంగా సందర్శించిన జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి. మంగళవారం జిల్లా కలెక్టర్‌ పర్యటనలో భాగంగా సిర్నాపల్లి గ్రామం సందర్శించారు. గ్రామపంచాయతీ కార్యాల‌యం ఆవరణంలో మొక్కలు నాటారు. అనంతరం గ్రామంలో హరిత హారం మొక్కలు పరిశీలించారు. పాఠశాల‌ ఆవరణంలో మియవాకి మినీ ఫారెస్ట్‌ పరిశీలించారు. గ్రామ పంచాయతీలో నగరాల‌లో లేనటువంటి పార్కు తయారు చేసుకోవాల‌న్నారు. డంపింగ్‌ యార్డ్‌ సందర్శించిన అనంతరం మాట్లాడుతూ మియావాకి ప్లాంటేషన్లో భాగంగా నాలుగు ...

Read More »

సేవాభారతికి రూ.20 వేల‌ విరాళం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోవిడ్‌ బాధితుల‌కు సేవలందిస్తున్న సేవాభారతికి తమవంతు చేయూతగా 20 వేల‌ రూపాయల‌ విరాళాన్ని కామారెడ్డికి చెందిన రవి కిరణ్‌, రణజిత్‌ మోహన్‌ (ఏబివిపి రాష్ట్ర పూర్వ అధ్యక్షుడు), వారి తండ్రి ధర్మరాజం జ్ఞాపకార్థం మంగళవారం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు జిల్లా సంఘచాల‌క్‌ బొడ్డు శంకర్‌, ఇందూర్‌ విభాగ్‌ ప్రచారక్‌ ఏలేటి రాజారెడ్డి, గోవర్ధన్‌, సేవాభారతి కార్యకర్తలు పాల్గొన్నారు.

Read More »

నివాళి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రణబ్‌ ముఖర్జీ అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, ఆయన దేశానికి ఎన్నో సేవ‌లు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి రాజ ముద్ర వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును ...

Read More »

ఆందోళన అవసరంలేదు…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యూరియా డిమాండ్‌ దృష్టిలో ఉంచుకొని అవసరమైన యూరియాను వెంటనే కేటాయించేలా చర్యలు తీసుకోవాల‌ని రాష్ట్ర రోడ్లు మరియు భవనాల‌ శాఖ మంత్రి వేముల‌ ప్రశాంత్‌ రెడ్డిని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కలెక్టర్‌ విన్నవించడం మేరకు మంత్రి చొరవ తీసుకొని ప్రభుత్వం ద్వారా జిల్లాకి మూడు ర్యాక్ల‌‌ యూరియా పంపించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. క్రిబ్‌కో ద్వారా 548 ...

Read More »

వైద్యుల‌ కృషి ఫలించకపోవడం దురదృష్టకరం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రణబ్‌ ముఖర్జీ ప్రాణాలు కాపాడడానికి వైద్యులు చేసిన కృషి ఫలించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ అంశంతో ప్రణబ్‌కు ఎంతో అనుబంధం ఉందని సిఎం అన్నారు. యుపిఏ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటుకు వేసిన కమిటీకి నాయకత్వం వహించిన ప్రణబ్‌, చివరికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన బిల్లుపై సంతకం ...

Read More »