Breaking News

నివాళి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 1

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం జిల్లా కాంగ్రెస్‌ పార్టీ కార్యాల‌యంలో మాజీ రాష్ట్రపతి స్వర్గీయ ప్రణబ్‌ ముఖర్జీ చిత్రపటానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు కైలాస శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రణబ్‌ ముఖర్జీ అతి చిన్న వయసులో పార్లమెంటు సభ్యులు, కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టడం జరిగిందని, ఆయన దేశానికి ఎన్నో సేవ‌లు అందించిన గొప్ప నాయకుడని కొనియాడారు.

ప్రత్యేక తెలంగాణ ఏర్పడడానికి రాజ ముద్ర వేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సుగమం చేశారన్నారు. ప్రణబ్‌ కేంద్రమంత్రిగా, రాష్ట్రపతిగా బడుగు బల‌హీన వర్గాల‌కు ఎన్నో సేవలందించిన గొప్ప నాయకుడన్నారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్‌, యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు పండ్ల రాజు, గుడుగు శ్రీనివాసు, కౌన్సిల‌ర్లు చాట్ల రాజేశ్వర్‌, సయ్యద్‌ అన్వర్‌ అహ్మద్‌, శివ, అంజద్‌, పంపరీ శ్రీనివాస్‌, రవి ప్రసాద్‌, సేరు, ధాత్రిక‌ సత్యం, గోనే శ్రీనివాస్‌, ఇంతియాజ్‌, సిరాజుద్దీన్‌, సర్వర్‌, సత్యం, ల‌క్క పతిని గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article