Breaking News

3న సర్టిఫికెట్ల దృవీకరణ

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దోస్త్‌ 2020-21 అడ్మిషన్‌ ప్రక్రియలో భాగంగా ప్రత్యేక వర్గ విద్యార్థులు 3వ తేదీ గురువారం యూనివర్సిటీ హెల్ప్‌లైన్‌ సెంటర్‌, తెలంగాణ యూనివర్సిటీలో దృవీకరణ ఉదయం 10 గంటల‌ నుండి జరుగుతుందని కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.బాల‌కిషన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అదేవిధంగా ఎన్‌సిసి విద్యార్థుల‌కు 4వ తేదీ శుక్రవారం దృవీకరణ జనరుగుతుందన్నారు. పిహెచ్‌, సిఏపి, ఎన్‌సిసి సర్టిఫికెట్‌ కలిగి ఉన్న వారు మొదటి విడతలో డిగ్రీ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్నవారు తప్పకుండా తెలిపిన తేదీల‌లో ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో వచ్చి దృవీకరణ చేసుకోవాల‌ని సూచించారు. ఈనెల‌ 8వ తేదీ వరకు మొదటి ఫేజ్‌లో రిజిస్ట్రేషన్స్‌, వెబ్‌ ఆప్షన్స్‌ పెట్టుకునే అవకాశం ఉందని తెలిపారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article