బ్యాంకు నుంచి ఇప్పించాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హత గల‌ రైతుల‌కు పంట రుణాల‌ను వ్యవసాయ అధికారులు బ్యాంకు నుంచి ఇప్పించాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. కలెక్టరేట్‌ జనహితలో బుధవారం వ్యవసాయ శాఖ అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. వారం రోజుల‌ వ్యవధిలో అన్ని మండలాల్లో 75 శాతం మంది రైతుల‌కు పంట రుణాలు అందే విధంగా చూడాల‌ని సూచించారు.

బ్యాంకులో రైతు పెండిరగ్‌ రుణాలు ఉంటే వన్‌ టైం సెటిల్మెంట్‌ చేయాల‌ని సూచించారు. వారికి తిరిగి రుణాలు ఇప్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 100 శాతం రైతుల‌కు బీమా సౌకర్యాన్ని కల్పించాల‌ని పేర్కొన్నారు.

పద్దెనిమిదేళ్లు నిండిన రైతుల‌కు భీమా చేయాల‌ని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి సింగారెడ్డి మాట్లాడుతూ వ్యవసాయ అధికారులు ఇంటింటికి వెళ్లి పంట రుణాల‌ను ఇప్పించాల‌ని కోరారు. పంట రుణం అవసరం లేకపోతే రైతు సంతకాన్ని రిజిస్టర్లో తీసుకోవాల‌ని పేర్కొన్నారు. సమావేశంలో లీడ్‌ బ్యాంక్‌ మేనేజర్‌ రాజేందర్‌ రెడ్డి, జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ శేషారావు, వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు.

Check Also

కామారెడ్డి వ్యాపారస్తుల‌కు ముఖ్య గమనిక

కామారెడ్డి, ఏప్రిల్‌ 22 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలో కరోనా వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ...

Comment on the article