Breaking News

ఎన్ని పనులు పూర్తయ్యాయి… ఎన్ని మిగిలాయి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జుక్కల్‌ క్లస్టర్లో రూర్బన్‌ పథకంలో మిగిలిన పనుల‌లో వేగం పెంచాల‌ని జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ అధికారుల‌ను ఆదేశించారు. శుక్రవారం జనహితలో జుక్కల్‌ క్లస్టర్‌లో రూర్బన్‌ పథకం కింద 30 కోట్లతో చేపట్టిన పనుల‌ను ఆయన జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంతు షిండేతో కలిసి అధికారుల‌తో సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 30 కోట్ల రూపాయల‌ నిధుల‌తో 363 పనులు చేపట్టడం జరిగిందని, ఇప్పటి వరకు 262 పనులు పూర్తి కావడం జరిగిందని తెలిపారు.

9 వ్యవసాయ స్టోరేజీ, డ్రైవింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌, 5 వేల‌ టన్నుల‌ కెపాసిటీ కలిగిన ఒక డ్రైయింగ్‌ ప్లాట్‌ ఫామ్‌, చందేగామ్‌ గ్రామం వద్ద హైలెవల్‌ వేబ్రిడ్జి, 24 పాఠశాల‌ల్లో కాంపౌండ్‌ గోడ నిర్మాణం, 14 బస్‌ ష్టెర్స్‌, పెద్ద గుల్ల‌ వద్ద లోలెవల్‌ కాజ్వే, 19 పాఠశాల‌ల్లో అదనపు తరగతి గదుల‌ నిర్మాణ, డ్రైనేజీల‌తో కలిసి 36 సిసి రోడ్లు, 10 డిజీటల్‌ పంచాయితీ సిటిజెన్‌ సర్వీసు సెంటర్స్‌, 7 అంగన్‌ వాడీ బిల్డింగ్‌, 4 మోడర్న్‌ డంపింగ్‌ యార్డులు పూర్తి చేసుకోవడం జరిగిందని తెలిపారు. 43 పాఠశాల‌ల్లో పొజెక్టర్‌, ఐసిటి కిట్స్‌ అందచేయడం జరిగిందని, 5 పాఠశాల‌ల్లో సోలార్‌ గార్డ్‌ ప్లాంట్స్‌ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.

4 హైడ్రాలిక్‌ ట్రాలీ ఆటోలు పంపిణీ చేయడం జరిగిందని, 5 చెక్‌ డ్యాముల‌ నిర్మాణం, 18 క్రిమిటోరియం నీటి వసతి కల్పించడం జరిగిందని తెలిపారు. ఇంకా 56 పనులు నిర్మాణంలో వున్నాయని, 45 పనులు ప్రారంభించుకోవాల్సి వుందని తెలియచేస్తూ, మిగిలిన పనుల‌ను వేగవంతం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ఈ సందర్భంగా జుక్కల్‌లో తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్‌ ఇన్‌ ఫ్యాక్స్‌ డవప్‌ మెంట్‌ కార్పోరేషన్‌ ద్వారా 5 కోట్లతో నూతనంగా నిర్మించిన 30 పడకల‌ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ భవనాన్ని జుక్కల్‌ శాసనసభ్యులు హన్మంతు షిండే, జిల్లా కలెక్టరు డాక్టర్‌ ఎ.శరత్‌ చేతుల‌ మీదుగా జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌కు హ్యాండోవర్‌ ప్రతులు అందచేయడం జరిగింది.

కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల‌ అదనపు కలెక్టరు వెంకటేశ్‌ ధోత్రే, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టరు హేమంత్‌ కేశవ్‌ పాటిల్‌, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి చంద్రమోహన్‌ రెడ్డి, జిల్లా వైద్య అధికారి డాక్టర్‌ చంద్రశేఖర్‌, వివిధ శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.

Check Also

మానవత్వాన్ని చాటిన రక్తదాత లావణ్య

కామారెడ్డి, మే 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరయ్య ...

Comment on the article