Breaking News

Daily Archives: September 5, 2020

ఆడపడుచుల‌కు అండగా తెలంగాణ ప్రభుత్వం

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మంగళూరు, నర్సింగ్‌ రావు పల్లి, ఆరేపల్లి, అచ్చంపేట్‌, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని గ్రామ పంచాయతీ కార్యాల‌యం వద్ద ల‌బ్ధిదారుల‌కు కళ్యాణ ల‌క్ష్మి చెక్కుల‌ను గైని స్వప్న రమేష్‌ కుమార్‌, పిట్ల అనసూయ సత్యనారాయణ, ఎర్రోళ్ల బాల‌య్య, సుబ్బూరి సాయిలు, పిట్లం ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, నాయకులు పట్లోళ్ళ దుర్గరెడ్డిలు కలిసి పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వంలోనే ఆడపడుచుల‌కు అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుందన్నారు. గత ...

Read More »

28 మందికి కరోనా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామంలో కరోన పరీక్షలు నిర్వహించినట్టు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మగ్దూంపూర్‌ గ్రామపంచాయతీ కార్యాల‌యంలో 104 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 27 మందికి, కోన తండాలో ఒకరికి శుక్రవారం మొత్తం 28 మందికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. కరోన కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌న్నారు. ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌, ...

Read More »

రైతు వ్యతిరేక ఆర్డినెన్సును వెనక్కి తీసుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇటీవల‌ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక కీల‌క ఆర్డినెస్సుల‌కు వ్యతిరేకంగా ఏఐకెఎస్ తెలంగాణ రైతు సంఘము కామారెడ్డి జిల్లా కార్యాల‌యంలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఒక రోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా నాయకుడు బండారి రాజిరెడ్డి మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన మొదటి ఆర్డినెన్స్‌ నిత్యావసర చట్ట సవరణ వల‌న దళారులు నిత్యావసర వస్తువులైన పప్పుధాన్యాలు, నూనె ధాన్యాలు, అలుగడ్డ ఉల్లిగడ్డ ...

Read More »

త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి, క్యాసంపల్లి గ్రామాల్లో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనుల‌ను ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ పరిశీలించారు. ఒక్కో రైతు వేదిక నిర్మాణానికి సుమారు 21 ల‌క్షల‌ రూపాయలు ప్రభుత్వం ఇస్తుందన్నారు. వచ్చే 15 రోజుల్లో పనులు పూర్తి చేసి రైతుల‌కు అందుబాటులో ఉంచాల‌ని అధికారుల‌ను, కాంట్రాక్టర్లను ఎమ్మెల్యే ఆదేశించారు.

Read More »

కామరెడ్డిలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు

కామరెడ్డి, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో రికార్డ్‌ స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. శనివారం ఒకే రోజు 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా జిల్లా వ్యాప్తంగా 5 వేల‌ 571 కి కరోనా కేసులు చేరాయి. హైదరాబాద్‌ తర్వాత అత్యధిక కేసులు నమోదు అవుతన్న జిల్లాగా కామారెడ్డి ఉంది.

Read More »

చాలా వరకు టెంపరరే

బోధన్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఐఎఫ్‌టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు కరోనా కారణంగా సంక్షోభంలో కార్మిక కుటుంబాల‌ను ఆదుకోవాల‌ని, యాజమానుల‌కు అనుకూలంగా కార్మిక చట్టాల‌ను‌ మార్చోద్దని, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్‌ రంగానికి అప్పగించొద్దని, ఎన్‌.ఎం.ఆర్‌, కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ కార్మికుల‌ను పర్మినెంట్‌ చేయాలంటూ తదితర డిమాండ్లతో బోధన్‌ ఆర్డీవో కార్యాల‌యం ముందు ధర్నా చేసి, ఆర్డీవో రాజేశ్వర్‌కి డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బి.మల్లేష్‌ మాట్లాడుతూ లాక్‌డౌన్‌, కరోనా మహమ్మారి ...

Read More »

నెంబర్‌ వన్‌ మార్కెట్‌ కమిటీగా రూపుదిద్దాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీని ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ బ్యాంక్‌ అధ్యక్షుడు పోచారం భాస్కర్‌ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. నూతన మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గ ఎన్నుకోబడిన పాత బాల‌కృష్ణను అభినందించి ఆశీర్వదించారు. మార్కెట్‌ కమిటీలోని ధాన్యం నిలువ‌ గోదాముల‌ను పరిశీలించారు. కొత్తగా ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను మార్కెట్‌ కమిటీ నిర్వహించనుండగా రైతుల‌కు ఎటువంటి ఇబ్బంది కల‌గకుండా కొనుగోలు కేంద్రాల‌ను నిర్వహించేలా చూడాల‌ని రైతుల‌కు అన్నివిధాలుగా సహాయసహకారాలు అందించాల‌ని సూచించారు. జిల్లాలోనే ...

Read More »

అందరం వారికి సహకరించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాజి మంత్రి పి.సుదర్శన్‌ రెడ్డి సహాయ సహకారాల‌తో నిజామాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ అద్యక్షుడు మానాల‌ మోహన్‌ రెడ్డి గారి ఆదేశాల‌ మేరకు నిజామాబాద్‌ మహిళ పోలీస్‌ స్టేషన్‌లో పోలీసు సిబ్బందికి ఎన్‌ఎస్‌యుఐ అద్యక్షుడు వేణురాజ్‌ చేతుల‌ మీదుగా శానిటైజర్‌, మాస్కులు పోలీసు బృందానికి అందజేశారు. ఈ సందర్భంగా వేణురాజ్‌ మాట్లాడుతూ కరోన సమయంలో పోలీసులు చేసే సేవ‌లు మరువలేనివని ప్రజల‌ కోసం నిత్యం కష్టపడుతున్న పోలీసుశాఖకు హాండ్‌ సానిటైజర్స్‌, మాస్కులు అందించిన మాజీ ...

Read More »

145 రోజుల‌కు స్వదేశానికి చేరిన మృత దేహం

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిసుదూర దేశంలో చనిపోయిన ఆప్తుని చివరి చూపుకోసం కుటుంబ సభ్యులు, బంధువులు దాదాపు అయిదు నెల‌లుగా ఎదిరిచూస్తుండగా చివరికి గల్ప్‌ మృతుడి శవపేటిక శనివారం సాయంత్రం హైదరాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకున్న సంఘటన జరిగింది. జగిత్యాల‌ జిల్లా వెల‌గటూరు మండలం కొండాపూర్‌ గ్రామానికిచెందిన సుంకె రాజయ్య (55) సౌదీ అరేబియా దేశంలోని రియాద్‌లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఏప్రిల్‌ 14న చనిపోయాడు. లాక్‌డౌన్‌ కారణంగా విమానాల‌ రాకపోకలు నిలిపివేసినందున శవపేటికను ఇండియాకు ...

Read More »

రేట్లు పెంచాల‌ని వినతి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం ఏఐటియుసి బీడీ కార్మిక సంఘం మరియు తెలంగాణ బీడీ కమిషనర్ల సంఘాల‌ ఆధ్వర్యంలో తెలంగాణ బీడీ మాన్యుఫ్యాక్చరర్స్‌ హ్యాండ్‌ టోబాకో మర్చంట్‌ అసోసియేషన్‌ వారికి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా బీడీ యూనియన్‌ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బీడీ రోల‌ర్స్‌ గత ఒప్పందం 31.5.2020 నాటికి ముగిసిందని, బీడీ కమిషన్‌ దారుల‌ గత వేతన ఒప్పందం 2020 మార్చి 31తో ముగిసిందని వీరిరువురి ఒప్పందం చేయాల్సిన అవసరముందన్నారు. ప్రస్తుత కరోనా ...

Read More »