Breaking News

28 మందికి కరోనా

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 5

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలంలోని మగ్దూంపూర్‌ గ్రామంలో కరోన పరీక్షలు నిర్వహించినట్టు మండల‌ వైద్య అధికారి రాధాకిషన్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మగ్దూంపూర్‌ గ్రామపంచాయతీ కార్యాల‌యంలో 104 మందికి ర్యాపిడ్‌ టెస్టులు చేయగా 27 మందికి, కోన తండాలో ఒకరికి శుక్రవారం మొత్తం 28 మందికి కరోన పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు తెలిపారు. కరోన కేసులు పెరుగుతున్న సమయంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాల‌న్నారు.

ఎవరైనా అత్యవసర పరిస్థితిలో తప్ప బయటకు వస్తే తప్పకుండా మాస్క్‌, ధరించి శానిటైజర్‌ ఉపయోగించాల‌న్నారు. నిజాంసాగర్‌ మండలంలో మొత్తం కేసులు 150 కాగా, అందులో కోలుకున్నవారు 35, కరోనా పాజిటివ్‌ కేసులు 115 మంది ఉన్నారన్నారు. కార్యక్రమంలో సూపర్‌వైజర్‌ సాయమ్మ, ఏఎన్‌ఎం సుజాత, హెల్త్‌ అసిస్టెంట్‌ సాయిలు, ఆయుష్‌ సిబ్బంది సాయిలు, పంచాయతీ కార్యదర్శి సంతోష్‌, విఆర్వో పరమేష్‌ తదితరులు ఉన్నారు.

Check Also

వాహనదారుల ఇబ్బందులు… పట్టించుకోని అధికారులు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి డివిజన్‌ పరిధిలోని పెద్ద చెరువు ...

Comment on the article