Breaking News

ఒకరోజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 7

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ మరియు దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ఆదేశానుసారం డిగ్రీ కళాశాల‌లో ప్రవేశాల‌ కోసం ఏర్పాటు చేసిన దోస్త్‌ ఫేస్‌ – 1 ప్రక్రియను ఒకరోజు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విశ్వవిద్యాల‌య రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తెలిపారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ 7 వ తేదీతో ముగుస్తుండగా విద్యార్థుల‌ అభ్యర్థన మేరకు 8 వ తేదీ వరకు దోస్త్‌ కన్వీనర్‌ పొడిగించినట్లు ఆమె తెలిపారు.

ఇప్పటి వరకు ఎవరైతే రిజిస్ట్రేషన్‌ చేసుకోలేదో వారు పొడిగించిన రోజును సద్వినియోగం చేసుకోవాల‌న్నారు. ఈ విషయాన్ని డిగ్రీ కళాశాలల‌ ప్రధానాచార్యులు, విద్యార్థులు పరిగణనలోకి తీసుకోవాల‌ని కోరారు. పూర్తి వివరాల‌ కోసం వెబ్‌ సైట్‌ సందర్శించాల‌న్నారు.

Check Also

సిబ్బంది వివరాలు సేకరించాలి

కామారెడ్డి, ఏప్రిల్‌ 9 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రయివేటు స్కూల్స్‌ ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది వివరాల‌ను మండల‌ ...

Comment on the article