Breaking News

Daily Archives: September 8, 2020

మరొక రోజు గడువు పెంపు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌, దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌. లింబాద్రి ఆదేశానుసారం డిగ్రీ కళాశాల‌లో ప్రవేశాల‌ కోసం ఏర్పాటు చేసిన దోస్త్‌ ఫేస్‌ – 1 ప్రక్రియను మరొక రోజు పొడిగిస్తున్నట్లు తెలంగాణ విశ్వవిద్యాల‌య రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం తెలిపారు. దోస్త్‌ రిజిస్ట్రేషన్‌ 7 వ తేదీతో ముగిసిపోగా విద్యార్థుల‌ అభ్యర్థన మేరకు 8 వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థుల‌ అభ్యర్థన ...

Read More »

దాతల‌ ద్వారా ఫాగింగ్‌ మిషన్లు ఏర్పాటు చేయాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో 450 పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని చాంబర్లో ఫోన్‌ కాన్ఫరెన్సులో మండల‌ స్థాయి అధికారుల‌తో ఆయన మాట్లాడారు. నిర్మాణంలో ఉన్న పల్లె ప్రకృతి వనాల‌ను ఈనెల‌ 15 లోగా పూర్తిచేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. కంపోస్టు షెడ్లను త్వరితగతిన పూర్తిచేసి గ్రామాల్లో సేంద్రియ ఎరువుల‌ తయారుచేసి రైతుల‌కు విక్రయించి పంచాయతీలు ఆదాయాన్ని సమకూర్చుకోవాల‌ని సూచించారు. మంకీ ఫుడ్‌ కోర్టు నిర్మాణం పూర్తిచేయాల‌ని ...

Read More »

వచ్చే ఏడాది ఎన్ని మొక్కలు నాటుతారు….

కామారెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వచ్చే సంవత్సరం హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడానికి గ్రామాల‌ వారిగా స్థలాల‌ను ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు నాటుతారో వివరాలు తయారు చేసి నివేదికల‌ను మండల‌ స్థాయి అధికారుల‌కు పంపాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం జనహిత భవనంలో హరితహారం కార్యక్రమంపై అధికారుల‌తో సమీక్ష నిర్వహించారు. శాఖల‌ వారీగా వచ్చే ఏడాది నాటే మొక్కల‌ వివరాల‌ను తెలియజేయాల‌ని పేర్కొన్నారు. మున్సిపల్‌లో మొక్కలు నాటే స్థలాల‌ను ఎంపిక చేసి, ఎన్ని మొక్కలు ...

Read More »

పచ్చదనం పెంపునకు కృషి చేయాలి

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పచ్చదనం పెంపునకు ప్రజా ప్రతినిధులు, అధికారులు కృషి చేయాల‌ని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. మంగళవారం ఆయన బిక్కనూరు, జంగంపల్లి, అంతంపల్లి, బస్వాపూర్‌ గ్రామాల‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనంలో ఐదు వేల‌ మొక్కలు ఉండే విధంగా చూడాల‌ని కోరారు. మొక్కలు దగ్గరదగ్గరగా నాటడం వ‌ల్ల‌ ప్రకృతి వనం చిట్టడవిలా మారుతోందని సూచించారు. నాటిన మొక్కల‌కు పాదుల‌ ఏర్పాటు చేయాల‌న్నారు. బిందుసేద్యం ద్వారా నీటిని అందించాల‌ని సూచించారు. ...

Read More »

వాడకం తగ్గించాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామాల‌లో ఉన్న 1 హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ వీలైనంత వరకు వాడకం తగ్గించాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మిషన్‌ భగీరథ వాటర్‌ 100 శాతం సప్లై ఉన్నచోట వన్‌ హెచ్‌పి వాటర్‌ మోటార్స్‌ డిస్‌ కనెక్టు చేయాల‌ని, దీనికి గ్రామ ప్రజలందరూ గ్రామ పంచాయతీకి సహకరించాల‌ని కోరారు.

Read More »

జిల్లా రెండవ స్థానంలో ఉంది…

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వచ్ఛభారత్‌ మిషన్‌లో సాలిడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌, లిక్విడ్‌ వేస్ట్‌ మేనేజ్మెంట్‌కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బు ఖర్చు చేస్తున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాల‌ని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి అన్నారు. మంగళవారం జెడ్‌పి చైర్మన్‌ విట్టల్‌ రావుతో కలిసి పల్లె ప్రగతి, వైకుంఠ ధామాలు, కంపోస్టు షెడ్‌, పల్లె ప్రకృతి వనాల‌పై, ఎంపీపీలు, ఎండిఓలు, జెడ్‌పిటిసిలు, సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిఓల‌ తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. నిజామాబాద్‌ ...

Read More »

బేషరతుగా విడుదల‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాల‌ని, ప్రభుత్వ విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాల‌ని డిమాండ్‌ చేసిన పి.డి.ఎస్‌.యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోయిన్పల్లి రామును హైదరాబాదులోని సంస్థ కార్యాల‌యంపై పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారని, అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షురాలు క‌ల్ప‌న అన్నారు. బేషరతుగా విడుదల‌ చేయాల‌ని డిమాండ్‌ చేశారు. కనీసం అసెంబ్లీ సమావేశాల్లో విద్యారంగంపై సమగ్రంగా చర్చించాల‌ని, ప్రైవేటు విద్యాసంస్థల‌ ఫీజు ...

Read More »

అభివృద్ధి పనులు ప్రారంభించిన నగర మేయర్‌

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని పలు డివిజన్ల‌‌లో అభివ ృద్ధి పనుల‌ను నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ శేఖర్‌ ప్రారంభించారు. నగర అభివృద్ధిలో భాగంగా పట్టణ ప్రగతిలో ప్రతి డివిజన్‌కు కేటాయించిన 10 ల‌క్షల‌ రూపాయల‌తో (మొత్తం 8 డివిజన్లలో 80 ల‌క్షల‌తో) చేపట్టే పనుల‌ను నగరంలోని 10వ డివిజన్లలో 80 క్వాటర్స్‌ వద్ద 10 ల‌క్షల‌ నిధుల‌తో సీసీ డ్రైనేజీ పనుల‌ను ప్రారంభించారు. అలాగే 11వ డివిజన్‌ హాసద్బాబానగర్‌లో 10 ల‌క్షల‌ ...

Read More »

రక్తదానం చేసిన ఎమ్మార్వో

కామరెడ్డి, సెప్టెంబర్‌ 8 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మెదక్‌కి చెందిన భూమేష్‌ 28 సంవత్సరాల‌ యువకుడు ప్రమాదంలో గాయపడటంతో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమైంది. కాగా ఎల్లారెడ్డి ఎమ్మార్వో శ్రీనివాస్‌ రావు వీ.టి. ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో మంగళవారం రక్తదానం చేశారని కామారెడ్డి రక్తదాతల‌ సమూహ నిర్వాహకుడు బాలు తెలిపారు. రక్తదానం చేసిన ఎమ్మార్వోకి కృతజ్ఞతలు తెలిపారు. గత నాలుగు నెల‌ల కాలంలో 250 మందికి సకాంలో రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడామని 15 సంవత్సరాల‌ నుండి దాదాపు ...

Read More »