Breaking News

కార్పొరేట్ల నుండి కాపాడండి!

బోధన్‌, సెప్టెంబర్‌ 10

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కంపెనీలకు వ్యవసాయాన్ని కట్ట బెట్టే మోదీ ప్రభుత్వం తెచ్చిన మూడు ఆర్డినెన్సులను 14 నుంచి జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ఉపసంహరించుకోవాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు పడాల శంకర్‌ డిమాండ్‌ చేశారు. బోధన్‌ మండలం ఖాజాపూర్‌ గ్రామంలో రైతులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

కేంద్ర ప్రభుత్వం పంటల కొనుగోళ్లకు కార్పొరేట్లకు స్వేచ్చ వాణిజ్యం, కంపెనీలకు కాంట్రాక్ట్‌ వ్యవసాయం, వ్యవసాయోత్పత్తుల నిల్వలపై పరిమితి రద్దు, వ్యవసాయ దారులపైనా, గహ వినియోగ దారులపైనా చార్జీల భారం పెంచే కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లులను 14 నుంచి జరుగనున్న పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రవేశ పెట్టి ఆమోదించుటకు కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడు ఆర్డినెన్సుల వల్ల కనీస మద్దతు ధరల విదానం, ప్రభుత్వ సేకరణ, ప్రజా పంపిణీ వ్యవస్థల రద్దుకు దారి తీస్తుందని, ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతాంగం, మరోవైపున ధరలు పెరిగి వినియోగ దారులు నష్టపోతారన్నారు.

పంటల మార్పిడి జరిగి దేశంలో ఆహార సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం వున్నందున వీటిని వెటనే ఉపసంహరించాలని డిమాండ్‌ చేశారు. కావున వీటిని ఉపసంహరించాలని కోరుతూ గ్రామ, మండల, జిల్లా ప్రజా పరిషత్‌లు, రాష్ట్ర అసెంబ్లీ తీర్మానాలు ఆమోదించించాలని, ఇందుకు ప్రజా ప్రతినిధులందరు కషి చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏఐకెఎంఎస్‌ నాయకులు బి.సాయులు, సి.హెచ్‌ గంగయ్య, ఐఎఫ్‌టీయూ నాయకులు డి.యాదవ్‌, గ్రామ మాజీ ఉప సర్పంచ్‌ ఎస్‌.లక్ష్మన్‌, గ్రామ రైతులు పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి సంక్షేమానికే పట్టం

బోధన్‌, మార్చ్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివ ృద్ధి సంక్షేమ ...

Comment on the article