Breaking News

Daily Archives: September 11, 2020

ప్రకృతి వనాల ద్వారా స్వచ్ఛమైన వాయువు లభిస్తుంది

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పల్లె ప్రకతి వనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు స్వచ్ఛమైన ప్రాణవాయువు లభిస్తుందని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ అన్నారు. తాడ్వాయి మండలంలోని తాడువాయి, చందాపూర్‌, సంగోజీ వాడి, కాలోజి వాడి, బ్రాహ్మణపల్లి గ్రామాల్లోని పల్లె ప్రకతి వనాలను శుక్రవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లె ప్రకతి వనాలతో ప్రజలకు మానసిక ప్రశాంతత కలుగుతోందని సూచించారు. దగ్గరదగ్గరగా మొక్కలు నాటడం వల్ల చిట్టడవిలా ప్రకతి వనాలు మారుతాయని పేర్కొన్నారు. తాడువాయిలో ...

Read More »

నిర్ణీత సమయంలో పరిష్కారం చేసుకోవచ్చు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ ఆఫీస్‌ ఫైల్‌ మేనేజ్మెంట్‌ ద్వారా అన్ని కార్యాలయాలు దస్త్రాలను పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ తెలిపారు. కలెక్టరేట్లోని జనహిత భవనంలో శుక్రవారం జిల్లా అధికారులతో ఈ ఫైల్‌ మేనేజ్మెంట్‌ ద్వారా దస్త్రాల పరిష్కరిస్తున్న తీరును ఆయన సమీక్షించారు. నిర్ణీత సమయంలో పారదర్శకంగా ఫైళ్లను పరిష్కారం చేసుకోవచ్చని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్లు పి.యాదిరెడ్డి, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేశ్‌ ధోత్రే, డిఆర్‌డిఓ చంద్రమోహన్‌ రెడ్డి, ఇతర శాఖల అధికారులు ...

Read More »

ప్రయివేటు టీచర్లను ఆదుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేట్‌ టీచర్‌లను, లెక్చరర్లను ప్రభుత్వం ఆదుకోవాలని టిజివిపి జిల్లా ప్రధాన కార్యదర్శి కొత్మిర్‌ కార్‌ రామకష్ణ డిమాండ్‌ చేశారు. శుక్రవారం భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ లాక్‌ డౌన్‌ కారణంగా అనేక ప్రైవేట్‌ విద్యాసంస్థలల్లో పనిచేస్తున్న ప్రైవేట్‌ ఉద్యోగులు వేతనాలు లేక సతమతమవున్న వారిని ఆదుకొని, ఎన్నో పోరాటాల కోర్చి సాధించుకున్న స్వరాష్ట్రంలో ఆకలి చావుని ఆపాలని డిమాండ్‌ చేశారు. ప్రైవేట్‌ టీచర్లకు, లెక్చరర్లకు ...

Read More »

నాణ్యత ఉండేలా చూసుకోవాలి

బాన్సువాడ, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం బాన్సువాడ మండలంలోని కోనాపూర్‌, తాడ్కోల్‌, దేశాయిపేట్‌, బీర్కూర్‌ మండలంలోని రైతు నగర్‌, బీర్కూర్‌ భైరాపూర్‌ క్లస్టర్‌ వారీగా రైతులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేలా నిర్మిస్తున్న రైతువేదికల నిర్మాణ పనులను, పల్లె ప్రకతి వనాలను ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డీసీసీబీ అధ్యక్షులు పోచారం భాస్కర్‌ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పనులు వేగవంతంగా పూర్తిచేయాలని, నిర్మాణంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా రైతు బంధు అధ్యక్షులు అంజిరెడ్డి, ...

Read More »

ప్రతి ఇంటికి తాగునీరు సరఫరా చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నగరంలో అన్ని ప్రాంతాలకు త్రాగు నీరు సరఫరా చేయాలని నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ అధికారులకు సూచించారు. శుక్రవారం నగర శివారు ప్రాంతాలు, అభివద్ధికి దూరంగా ఉన్న ప్రాంతాలలో ప్రజల త్రాగు నీటి అవసరాలను తీర్చాలని ప్రతి ఇంటికి త్రాగు నీరు సరఫరా చేయాలని సంబంధిత అధికారులతో కలిసి మారుమూల ప్రాంతాలలో పర్యటించారు. గత రెండు రోజులుగా వాటర్‌ పైప్‌ లైన్‌ లీకేజీ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ...

Read More »

టిఆర్‌ఎస్‌ నాయకుల సంబరాలు

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అసెంబ్లీ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన నూతన రెవెన్యూ చట్టాన్ని ఆమోదించినందుకు నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని మండల పరిషత్‌ కార్యాలయం వద్ద టిఆర్‌ఎస్‌ నాయకులు టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచిపెట్టి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మహేందర్‌, మాజీ సిడిసి చైర్మన్‌ దుర్గరెడ్డి, పిట్లం ఎయంసి వైస్‌ చైర్మన్‌ గైని విఠల్‌, మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షులు రమేష్‌ గౌడ్‌, సొసైటీ చైర్మన్‌ నరసింహారెడ్డి, సర్పంచ్‌లు కమ్మరి కత్త ...

Read More »

అడ్మిషన్‌ గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ మరియు పిజి అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్‌ 24వ తేదీ వరకు గడువు పొడిగించినట్టు నిజామాబాద్‌ రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బి.ఏ, బి.కాం, బిఎస్‌సి లలో అడ్మిషన్‌ పొందడానికి ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఓపెన్‌ ఇంటర్‌, ఐటిఐలో రెండు సంవత్సరాల కోర్సు చేసి పాస్‌ అయిన వారు సెప్టెంబర్‌ 24వ తేదీ లోపు అడ్మిషన్‌ తీసుకోవచ్చన్నారు. అలాగే పిజిలో ...

Read More »

నీటి సరఫరాకు రెండురోజుల అంతరాయం

ఆర్మూర్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాల్కొండ మండలం జలాల్‌పూర్‌ గ్రామ పరిధిలో ఎస్‌ఆర్‌ఎస్‌పి రిజర్వాయర్‌ మిషన్‌ భగీరథ ఇంటర్‌నెల్‌ వద్దగల పంపు సెట్లు మరియు అర్గుల్‌ వద్ద గల మెయిన్‌ పైప్‌లైన్‌ మరమ్మతులు చేయడం కోసం 12వ, 12వ తేదీల్లో రెండురోజుల పాటు బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాలు మరియు ఆర్మూర్‌, నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గాలలో గల అన్ని ఆవాసాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా నిలిపి వేయడం జరుగుతుందని మిషన్‌ భగీరథ గ్రిడ్‌ విభాగం కార్యనిర్వాహక ...

Read More »

22 నుంచి సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలలోని బిఏ, బికాం, బిఎస్సి, బిబిఎ, బిఎ(ఎల్‌) కోర్సులకు ఈ నెల 15 వ తేదీ నుంచి ప్రారంభం కావలసిన చివరి (ఆరవ) సెమిస్టర్‌ రెగ్యూలర్‌ పరీక్షలు మరియు మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్లకు చెందిన (2016 – 2017 బ్యాచ్‌ విద్యార్థులకు మాత్రమే) బ్యాక్‌ లాగ్‌ పరీక్షలను కొవిద్‌ – 19 నిబంధనలను అనుసరించి ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభించనున్నామని ...

Read More »

సర్కార్‌ భూమి హాంఫట్‌..!

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అతనొక రెవెన్యూ శాఖలో చిరుద్యోగి. ఓ గ్రామంలో విఆర్‌ఏగా పని చేస్తుంటాడు..ఉద్యోగం కంటే ఎక్కువ రియల్‌ ఎస్టేట్‌ పై దష్టి పెడతాడు. విలువైన భూములపై దష్టి సారించి కబ్జాకు యత్నిస్తూ ఏకంగా జాతీయ రహదారికి ఆనుకొని వున్న ఐదెకరాల భూమిపై కన్నేశాడు..రెవెన్యూ శాఖలో వున్న లొసుగులే అతని ఆయుధం. కామారెడ్డి పట్టణానికి 6 కిలోమీటర్ల దూరలోని జాతీయ రహదారిపై గల ఐదెకరాల భూమిని బినామీ పేరిట పాసుబుక్‌ పొందాడు. ఇటీవల ఈ భూమిని ...

Read More »

మూడు రోజుల్లో క్లియర్‌ చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామ పంచాయితీలకు సంబంధించిన బిల్లులు జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ విభాగం మరియు జిల్లా ట్రెసరీ విభాగాలలో చాలా రోజులుగా పెండింగులో ఉంటున్నాయని, దానివల్ల నిధుల కొరత ఏర్పడి రొటేషన్లో చేయవలసిన అనేక పనులు పెండింగులో పడుతున్నాయని తద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సర్పంచులు అదనపు కలెక్టర్‌ లత దష్టికి తీసుకువచ్చారు. అందుకు స్పందించిన అదనపు కలెక్టర్‌ సంబంధిత అధికారులకు మూడు రోజుల్లో పెండింగ్‌ బిల్లులన్ని క్లియర్‌ చేయాలని సూచించారు. క్లియర్‌ కానీ పక్షంలో ...

Read More »

108లో ఉద్యోగావకాశాలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవీకే ఈఎంఆర్‌ఐ ఆధ్వర్యంలో నడుపబడుతున్న 108 ఎమర్జెన్సీ అంబులెన్స్‌ వాహనాలలో పనిచేయుటకు ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హత కలిగిన అభ్యర్దుల నుండి దరఖాస్తులు స్వీకరించబడునని జిల్లా ప్రోగ్రోమ్‌ మేనేజరు భూమా నాగేందర్‌, జిల్లా ఎగ్జిక్యూటివ్‌ దుర్గయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌, ఆధార్‌ కార్డు, ఒక జిరాక్స్‌ కాపీస్‌ సెట్‌ను వెంట తీసుకొని ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు. ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నిషియన్‌ పోస్టుకు అర్హతలు ...

Read More »

మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదులోని ప్రైవేటు వైద్యశాలలో 55 సంవత్సరాల మహిళకు రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలుని సంప్రదించారు. సమూహ క్రియాశీలక సభ్యుడు కిరణ్‌ సహకారంతో పట్టణానికి చెందిన సాయికిరణ్‌ ఏ నెగిటివ్‌ రక్తాన్ని అందించి ప్రాణాలు కాపాడినట్టు తెలిపారు. ఈ సందర్భంగా బాలు మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి కామారెడ్డి రక్తదాతల సమూహం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రతి ఒక్కరు రక్తదానం చేయడానికి ముందుకు ...

Read More »